Sudha Kongara : లేడీ డైరెక్టర్ సుధ కొంగరకి బంపర్ ఆఫర్..

Sudha Kongara : ఇండియన్ సినిమాలో అతికొద్ది మాత్రమే లేడి డైరెక్టర్స్ ఉన్నారు.. అందులో వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుధ కొంగర.. మాధవన్‌తో 'ఇరుధి సుత్రు', సూర్యతో 'సూరరై పొట్రు', వెంకటేష్‌తో గురు వంటి చిత్రాలను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడీ లేడీ డైరెక్టర్‌కి క్రేజీ ఆఫర్ దక్కింది. 'కెజిఎఫ్ : చాప్టర్ 1' మరియు 'కెజిఎఫ్ : చాప్టర్ 2' చిత్రాలను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ తమ కొత్త సినిమాని సుధా కొంగరతో చేస్తున్నట్టుగా అఫీషియల్‌గా ప్రకటించారు. "కొన్ని నిజమైన కథలు చెప్పడానికి చెప్పడానికి అర్హురాలైన దర్శకురాలు సుధా కొంగరతో మా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం మాకు గర్వకారణం ఉంది. మా అన్ని చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము" అని తెలిపారు.
𝐒𝐨𝐦𝐞 𝐭𝐫𝐮𝐞 𝐬𝐭𝐨𝐫𝐢𝐞𝐬 𝐝𝐞𝐬𝐞𝐫𝐯𝐞 𝐭𝐨 𝐛𝐞 𝐭𝐨𝐥𝐝, 𝐚𝐧𝐝 𝐭𝐨𝐥𝐝 𝐫𝐢𝐠𝐡𝐭.
— Hombale Films (@hombalefilms) April 21, 2022
To a new beginning with a riveting story @Sudha_Kongara, based on true events.@VKiragandur @hombalefilms @HombaleGroup pic.twitter.com/mFwiGOEZ0K
అయితే ఈ సినిమాలో హీరో ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో ఆసక్తి నెలకొంది. వినిపిస్తోన్న ఊహాగానాల ప్రకారం హీరో సూర్య ఇందులో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా సుధ కొంగర మన తెలుగమ్మాయి.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది. ఆమె తండ్రి ఆంధ్రప్రదేశ్ చెందినవారు కాగా, తల్లి చెన్నైకి చెందినవారు.. మణిరత్నంతో కలిసి ఏడేళ్లు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన సుధ ద్రోహి (2010) చిత్రంతో దర్శకురాలిగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com