సినిమా

Bigg Boss 5 Telugu: లహరి ఎలిమినేషన్‌కు కారణం ఇదేనా..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ (Bigg boss) హౌస్‌‌లో ప్రేక్షకులను ఎవరు ఎంత మెప్పించారు అన్నదే మెయిన్ పాయింట్.

Bigg Boss 5 Telugu: లహరి ఎలిమినేషన్‌కు కారణం ఇదేనా..
X

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ (Bigg boss) హౌస్‌ను ఎవరు ఎంత ఇష్టపడినా వారు ప్రేక్షకులను ఎంత మెప్పించారు అనేదాన్ని బట్టి వారు ఆ హౌస్‌లో ఎన్నిరోజులు ఉండగలుగుతారు అనే విషయం డిసైడ్ అవుతుంది. అలా ఈ వారం అందరినీ మెప్పించలేక అతి తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయ్యింది లహరి షారీ (Lahari shari). పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన లహరి బిగ్ బాస్ సీజన్ 5లో ఒక కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. మొదటి రోజు నుండే తాను బ్యూటీ విత్ బ్రెయిన్స్ కాంబినేషన్ అని అందరికీ నిరూపిస్తూ వచ్చింది.

ఇక బిగ్ బాస్ హౌస్ అంటే గొడవలు సహజం కాబట్టి తాను కూడా పలు సందర్భాల్లో హౌస్‌మేట్స్‌తో వాగ్వాదానికి దిగింది. టాస్క్‌లలో చురుగ్గా ఆడింది. గతవారం బిగ్ బాస్‌లో జరిగిన అమెరికా అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయి టాస్క్‌లో ప్రతీ టీమ్ నుండి ఒక బెస్ట్ పర్ఫార్మర్‌ను ఎంచుకోమని బిగ్ బాస్ చెప్పినప్పుడు హైదరాబాద్ అమ్మాయి టీమ్ నుండి లహరి నిలబడాలని నిర్ణయించుకుంది. కానీ జెస్సీతో సమానంగా తనకు కూడా ఓట్లు పడేసరికి లహరి క్యాప్టన్సీ పోరు నుండి తప్పుకుని ఆ ఛాన్స్ జెస్సీకి ఇచ్చేసింది. ఒకవేళ అక్కడ తాను తప్పుకోకుండా క్యాప్టన్స్ పోరులో నిలబడి క్యాప్టన్ అయ్యింటే నామినేషన్స్ దగ్గర తను సేవ్ అయ్యే అవకాశాలు ఉండేవి.

అంతే కాకుండా నామినేషన్స్ సమయంలో ప్రియా లహరిపై చేసిన అభియోగాలు కూడా ప్రేక్షకుల్లో లహరిపై నెగిటివిటీని పెంచాయి. ఆ తర్వాత వారి మధ్య జరిగిన గొడవ పరిష్కారమైనా కూడా ప్రేక్షకుల్లో తన మీద పడిన నెగిటివ్ ఇంప్రెషన్ మాత్రం అలాగే ఉండిపోయింది. అదే తన ఎలిమినేషన్‌కు ముఖ్య కారణం కూడా. లహరి బయటికి వచ్చేసిన తర్వాత తనని నామినేట్ చేసిన షన్ను, సిరితో కోపంగానే మాట్లాడుతూ వారికి గుడ్‌బై చెప్పింది. ఉన్నది నాలుగు వారాలే అయినా లహరి మాత్రం బిగ్ బాస్ వల్ల చాలామంది ఫ్యాన్స్‌నే సంపాదించుకుంది.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES