Lal Singh Chaddha OTT : లాల్ సింగ్ చడ్డా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్, రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

Lal Singh Chaddha OTT : లాల్ సింగ్ చడ్డా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్, రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
X
Lal Singh Chaddha OTT : ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా మూవీ రిలీజై ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంది

Lal Singh Chaddha OTT : ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా మూవీ రిలీజై ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా అని సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. బాహుబలి నుంచి బాయ్‌కాట్ ట్రెండ్ సాగుతూ వచ్చి లాల్ సింగ్ చడ్డాపై తీవ్రమైన ప్రభావం చూపింది. 180 కోట్లతో నిర్మించిన లాల్ సింగ్ చడ్డా థియేటర్ల నుంచి ఇప్పటివరకు 120 కోట్లను వసూలు చేసుకుంది.

ఈ సినిమాను చూడనివాళ్లు ఇంకా అనేక మంది ఉన్నారు కాబట్టి ఓటీటీలో అనుకున్న దానికంటే ముందే రిలీజ్ చేయడానికి మేకర్స్ ఒప్పందం చేసుకున్నారు. సినిమా రిలీజ్‌కు ముందు ఆమీర్ ఖాన్ ఓటీటీల వల్ల కూడా పెద్ద బడ్జెట్ సినిమాలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. కొన్ని రోజులకే ఓటీటీలో వస్తే.. ఇక థియేటర్లో ఎవరు చూస్తారని ఆయన అన్నారు.

మొదట్లో ఆరు నెలల తరువాతే లాల్ సింగ్ చడ్డా ఓటీటీలోకి వస్తుందన్నారు. అయితే ఇప్పుడు భారీ నష్టం రావడంతో నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 20న విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

Tags

Next Story