Lara Dutta: డేటింగ్ సైట్‌లో హీరోయిన్ ప్రొఫైల్.. క్లారిటీ ఇచ్చిన నటి..

Lara Dutta (tv5news.in)
Lara Dutta: సోషల్ మీడియాలో 'ఫేక్' అనే మాటకు ఆస్కారం ఎక్కువ. ఎవరు ఎవరి పేరుతో అయినా, ఫోటోతో అయినా ఫేక్ అకౌంట్‌ను క్రియేట్ చేసేయొచ్చు. అది నిజమైన అకౌంట్ అని అందరినీ నమ్మించవచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఈ ఫేక్ అకౌంట్‌ల సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఓ బాలీవుడ్ నటి ఇలాంటి ఒక ఫేక్ అకౌంట్ వల్లే ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇటీవల ఆ ఫేక్ అకౌంట్‌పై తాను ప్రేక్షకులకు ఓ క్లారిటీ ఇచ్చింది.
డేటింగ్ యాప్స్ అనేవి ఈ మధ్య యూత్‌ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. సింగిల్‌గా ఉండే అమ్మాయిలు, అబ్బాయిలు తమకంటూ ఒక బాయ్‌ఫ్రెండ్ కోసమో.. లేక గర్ల్‌ఫ్రెండ్ కోసమో వీటిలో లాగిన్ అయ్యి సెర్చింగ్ స్టార్ట్ చేస్తారు. అయితే ఇందులో పెట్టిన ప్రొఫైల్ ఫేకా కాదా అన్న దానికి ఆధారాలు ఏమీ ఉండవు. తాజాగా ఒక డేటింగ్ సైట్‌లో హీరోయిన్ లారా దత్తా ఫోటో అందరికీ తారసపడుతోంది. అయితే ఇది నిజంగానే ఆ నటి ప్రొఫైలే అని చూసినవారు అనుకుంటున్నారు.
తాను ఎలాంటి డేటింగ్ సైట్‌లో లేనని, అలాంటివి చూసి నమ్మవద్దని అందరికీ క్లారిటీ ఇచ్చేసింది లారా దత్తా. ఒకప్పుడు బాలీవుడ్ స్క్రీన్‌పై తన గ్లామర్‌ను ఒలకబోసి.. కుర్రకారును ఉర్రూతలుగించిన లారా.. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ మహేశ్ భూపతిని పెళ్లాడి ఫ్యామిలీ ఉమెన్‌గా సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం సినిమాల్లో కేవలం యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ఇటీవల ఈ డేటింగ్ సైట్ ఇష్యూతో తాను మరోసారి లైమ్ లైట్‌లోకి వచ్చింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com