Kantara: 'కాంతార' సినిమా ఆ హీరోతో చేయాలనుకున్నా.. : రిషబ్ శెట్టి

Kantara: కాంతార సినిమా ఆ హీరోతో చేయాలనుకున్నా.. : రిషబ్ శెట్టి
Kantara: అన్నీ అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది.. ఆఖరికి సినిమా కూడా కాదు.. అవును మరి ఒకర్ని అనుకుని మరొకరితో తీసిన సినిమాలు చాలా ఉన్నాయి

Kantara: అన్నీ అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది.. ఆఖరికి సినిమా కూడా కాదు.. అవును మరి ఒకర్ని అనుకుని మరొకరితో తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. దానిక్కూడా అదృష్టం ఉండాలేమో. సినిమాలో నటించే అవకాశం వదులుకోవాల్సి వచ్చింది. కానీ అంతలోనే పునీత్ రాజ్ కుమార్ జీవితం కూడా ముగిసిపోయింది.

రూ.16కోట్ల బడ్జెట్‌తో తీసి ఇప్పటికే రూ.350 కోట్లు వసూలు చేసిన బ్లాక్ బస్టర్ మూవీలో మొదట అనుకున్న హీరో పునీత్ రాజ్ కుమార్ అని ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు కాంతారా హీరో రిషబ్ శెట్టి.

హీరో పునీత్ రాజ్ కుమార్‌కు కథ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కానీ అతను తన బిజీ షెడ్యూల్ మరియు ఇతర కమిట్‌మెంట్‌ల కారణంగా చేయలేకపోయారు.

"ఇదంతా కనురెప్పపాటులో జరిగింది. నేను అతనికి కథ చెప్పిన వెంటనే, అతను ప్రాజెక్ట్ గురించి చాలా ఎగ్జైట్ అయ్యాడు. అతను విభిన్న కథల కోసం అన్వేషిస్తునంటాడు. అందుకే ఈ కథ అతడికి బాగా నచ్చింది. కానీ, అతని ఇతర ప్రాజెక్టుల కారణంగా చేయలేకపోతున్నానని చెప్పారు.


ఇదే విషయాన్ని ఒక రోజు నన్ను పిలిచి చెప్పాడు. నన్నే అందులో హీరోగా నటించమని చెప్పాడు. తన కోసం వేచి ఉండొద్దని అన్నాడు. దాంతో తానే హీరోగా కాంతారా మొదలు పెట్టానని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు రిషబ్ శెట్టి.

రిషబ్ శెట్టి కాంతారా చిత్రంలో శివగా నటించాడు. పునీత్ మరణానికి కేవలం రెండు రోజుల ముందు, రిషబ్ బజరంగీ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. అక్కడ దివంగత నటుడు ప్రాజెక్ట్ (కాంతారా) గురించి అడిగాడు.

అదే విషయాన్ని గుర్తుచేసుకుంటూ, రిషబ్ మాట్లాడుతూ, "అతను ఈ ప్రాజెక్ట్ గురించి అడిగి, సినిమా కోసం రాజీపడవద్దని అన్నాడు. నేను షూట్ నుండి కొన్ని స్టిల్ చిత్రాలను అతనికి చూపించాను. అతను చాలా సంతోషం వ్యక్తం చేశాడు. సినిమా చూడాలని ఆసక్తిగా ఉందని చెప్పాడు.

'నాకు తోడుగా, అప్పూ సార్ ఈ పాత్రకు చాలా బాగా సరిపోతారని భావించాను'. రిషబ్ ఎప్పటి నుంచో ఈ సినిమాలో శివగా నటించాలని అనుకున్నాడు. అయితే, నిర్మాణాన్ని ప్రారంభించే కొన్ని నెలల ముందు, శెట్టి పవర్‌స్టార్ పునీత్ పేరును అనుకున్నాడు. ముఖ్యంగా గేదెల పందెం సన్నివేశాల్లో.

కన్నడ చిత్రం కాంతారా

అక్టోబర్ 14న హిందీలో కూడా విడుదలైంది. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి రచన మరియు దర్శకత్వం వహించారు. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించిన కాంతారా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.

Tags

Read MoreRead Less
Next Story