Puneeth Rajkumar: మరణం తర్వాత పునీత్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం..

Puneeth Rajkumar (tv5news.in)
Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ హీరోగానే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలతో ఒక మంచి మనిషిగా ముద్ర వేసి వెళ్లిపోయారు. హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూసిన పునీత్ రాజ్‌కుమార్ మరణం శాండల్‌వుడ్‌కు తీరని లోటు. ఇప్పటికీ ఆయన మరణవార్తను కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే కాదు.. ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి వ్యక్తికి తగిన గౌరవం అందించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించుకుంది.
తాను నటుడిగా సినిమాల్లో నటిస్తున్నప్పుడు పునీత్ రాజ్‌కుమార్ ఎన్నో అవార్డులను అందుకున్నారు. అందుకే ఆయన మరణానంతరం కూడా ఆయనను పురస్కారంతో సత్కరించాలని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నిర్ణయించారట.
కర్నాటక రాష్ట్రానికే అత్యున్నత పురస్కారమైన 'కర్నాటక రత్న'ను త్వరలోనే పునీత్ రాజ్‌కుమార్ పేరిట నిలపనుంది అక్కడి ప్రభుత్వం. ఈ పురస్కారం ఆయన బతికుండి తీసుకుంటే చాలా బాగుండేది అని ఆయన అభిమానులు మరోసారి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com