Pushpa 2: అతిథి పాత్రలో ఆ హీరో నటిస్తున్నాడా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిందో సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'పుష్ప-2' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఓ రూమర్ తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో అతిథి పాత్రలో కనిపిస్తాడని.. ఆ హీరో సూర్య అని కొత్తగా ప్రచారం జరుగుతోంది. అదే గనక నిజమైతే.. ఈ సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశం ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక 'పుష్ప 2' వచ్చే షెడ్యూల్ లో భాగంగా గుంతకల్లు నల్లమల అడవుల ప్రాంతంలో ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్ – ఫహద్ ఫాసిల్ లపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను సుకుమార్ ప్లాన్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ గా నిలవనుందట. మొత్తానికి 'పుష్ప 2' సినిమాని సుకుమార్ వెరీ ఇంట్రెస్ట్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. పైగా ఈ పుష్ప సీక్వెల్ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా పరిచయం కానున్నాయి. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
'పుష్ప' సినిమాలో ;ఊ అంటావా మావా.. ' ఐటెం సాంగ్ తో స్టార్ హీరోయిన్ సమంత ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 'పుష్ప 2' లోనూ సుకుమార్ ఓ స్పెషల్ సాంగ్ ను పెట్టినట్టు సమాచారం. ఈ సాంగ్ కు 'ధమాకా; హీరోయిన్ శ్రీలీలను సెలెక్ట్ చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం శ్రీలీల చేతిలో వరుస ప్రాజెక్టులు లైన్ లో ఉండడంతో ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందని, ప్రస్తుత బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఈ మూవీని తిరస్కరించిందని, హీరోయిన్ గా దూసుకుపోతున్న ఆమెకు ఈ తరహా రోల్ లో నటించడం ఆసక్తిగా లేదని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక మరి ఈ సాంగ్ లో సుకుమార్ ఎవరిని చూపిస్తారోనని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com