అనుమానాలకు తావిస్తున్న 'సమంత' ఇన్‌స్టా పోస్టులు..

అనుమానాలకు తావిస్తున్న సమంత ఇన్‌స్టా పోస్టులు..
చై, సామ్ జంట విడిపోవాలని ఎవరూ కోరుకోరు. అయితే ఇద్దరి మధ్య నిజమైన దూరం ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది

క్యూట్ కపుల్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ అని పేరున్న సమంత, నాగ చైతన్య జంట విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలకు చెక్ పడేదెప్పుడో కానీ అక్కినేని అభిమానులు కలవరపడుతున్నారు. ఏ వివాహిత జంట అయినా సుదీర్ఘ వైవాహిక బంధాన్ని కలిగి ఉండాలని కోరుకునే సమాజం మనది.

చై, సామ్ జంట విడిపోవాలని ఎవరూ కోరుకోరు. అయితే ఇద్దరి మధ్య నిజమైన దూరం ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది కాబట్టి, దీనిని ఎవరు ముందుగా తెరపైకి తీసుకువచ్చారు అని తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. విడాకులు పరస్పర అంగీకారంతో మాత్రమే సాధ్యమవుతాయి, అయితే విడిపోవడానికి ఎవరు ఎక్కువ తొందరపడుతున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు చాలా మంది.

నిన్నటి లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ వేడుకలో అమీర్ ఖాన్ నాగ చైతన్యను ప్రశంసిస్తూ మాట్లాడిన మాటలు అక్కినేని అభిమానులకు ఊరటనిచ్చాయి. పరోక్షంగా ఆమీర్ మాట్లాడిన మాటలు నాగ చైతన్యకు విడాకులు ఇవ్వడం ద్వారా సమంత నిజంగా చాలా కోల్పోయిందనే అభిప్రాయాన్ని వెల్లడి చేస్తుంది.

కానీ సమంత వైపు నుండి చూస్తే, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక సింబాలిక్ చిత్రాలను పోస్ట్ చేస్తోంది. ఆమె చాలా కాలంగా సోషల్ మీడియాకు హింట్ ఇస్తోంది. ఇద్దరి మధ్య అభిప్రాయా బేధాలు తలెత్తాయనే విషయాన్ని అస్పష్టంగా వివరిస్తోంది.

ఇటీవలి ఇన్‌స్టా పోస్ట్‌లు కూడా అదే అర్థాన్ని ఇచ్చేలా ఉన్నాయి. "వాస్తవానికి మీరు నన్ను బాధపెట్టారు.. నేను నిన్ను బాధపెట్టాను ... వాస్తవానికి మనిద్దరం ఒకరినొకరు బాధించుకున్నాము..

"వసంత కాలం రావాలంటే ముందు వచ్చే శిశిరాన్ని భరించాల్సిందే. దీనిని బట్టి సమంత. నాగ చైతన్య సహవాసం కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమె తనతో ఉండాలని నాగ చైతన్యను అడుగుతోంది. ఆమె అతనితో తన సంబంధాన్ని కొనసాగించాలనుకుంటోంది. విరిగిన మనసును అతికించాలని ప్రయత్నిస్తున్నట్లుందని సమంత పోస్టులు చూసి నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story