Latest Update on Kushi Trailer : 2 నిమిషాల 41 సెకన్లతో 'ఖుషి' ట్రైలర్

Latest Update on Kushi Trailer : 2 నిమిషాల 41 సెకన్లతో ఖుషి ట్రైలర్
X
'ఖుషి' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

'ఖుషీ' మూవీ అభిమానులకు మేకర్స్ ఓ శుభవార్తను ప్రకటించారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు కలిసి నటిస్తోన్న ఈ లవ్ స్టోరీ బేస్డ్ మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజైన పాటలు ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఇక వారిద్దరి అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకున్నారు. ఇప్పుడు, ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు. మరో రెండు రోజుల తర్వాత అంటే ఆగస్టు 9న విడుదల చేయనున్నట్లు విజయ్ ఈ విషయాన్ని స్వయంగా పంచుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన 'ఖుషి' సినిమా ట్రైలర్ 2 నిమిషాల 41 సెకన్లు ఉంటుందని విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సంతోషకరమైన వార్తతో పాటు, ఖుషి మూవీలోని విజయ్, సమంతల రొమాంటిక్ పోస్టర్‌ను కూడా ఆయన షేర్ చేశాడు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే డియర్ కామ్రేడ్ హీరో విజయ్.. తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశాడు. 'ఖుషీ' గురించి ఏదైనా కొత్త అప్‌డేట్‌ల కోసం ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్న అభిమానులందరికీ సంతోషకరమైన వార్తను అందించాడు. విజయ్ ఈ చిత్రం నుండి సమంతతో కలిసి ఉన్న రొమాంటిక్ పోస్టర్‌ను పంచుకున్నాడు. దాంతో పాటు "ఈ ఆగస్ట్ 9న.. 2 నిమిషాల 41 సెకన్లతో 'ఖుషీ' ట్రైలర్ రాబోతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1 విడుదల అవుతుంది" అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. ఆయన మాత్రమే కాదు, సమంత కూడా ఇదే పోస్టర్‌ను షేర్ చేసింది.

ఈ ఏడాది సెప్టెంబర్ 1న 'ఖుషీ' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండడంతో.. సమంతా, విజయ్‌ల కొత్త జంటను వారి స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విజయ్, సామ్ ఇచ్చిన అప్ డేట్ తో.. ఇక 'ఖుషీ' కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఇద్దరు నటులు గతంలో నాగ్ అశ్విన్ మహానటిలో కలిసి పనిచేసినప్పటికీ, వారు పూర్తి స్థాయి పాత్రలో కలిసి కనిపించడం ఇదే మొదటిసారి. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుండి చాలా మంచి ఆదరణ పొందాయి. అంతే కాకుండా ఈ చిత్రం సమంత, విజయ్ ఇద్దరి కెరీర్‌పై సానుకూల ప్రభావం చూపుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags

Next Story