Ram Charan : రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీపై లేటెస్ట్ అప్డేట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ గా రాబోతున్నాడు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఫస్ట్ టైమ్ డ్యూయొల్ రోల్ చేశాడు చరణ్. కియారా అద్వానీ హీరోయిన్ గా సునిల్, నవీన్ చంద్ర, అంజలి, ఎస్.జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ తర్వాత కమిట్ అయిన ప్రాజెక్ట్ బుచ్చిబాబుది. శ్రీకాకుళ ప్రాంతంలోని ఓ వ్యక్తి కథను స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చెప్పబోతున్నారు అనే టాక్ ఉంది. అతను కోడి రామ్మూర్తి నాయుడు అని కూడా అంటున్నారు. అవన్నీ ఎలా ఉన్నా.. ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతోంది. అలాగే కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్ ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ. రీసెంట్ గానే ఓపెనింగ్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి కీలకమైన అప్డేట్ ఇచ్చింది టీమ్.
నవంబర్ చివరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందట. ఈ షూట్ లో రామ్ చరణ్ తో పాటు కీలకమైన ఆర్టిస్టులు కూడా పాల్గొనబోతున్నారు. అక్కడ నాన్ స్టాప్ గా 15 రోజుల పాటు చిత్రీకరణ జరుపుతారని టాక్. తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలవుతుందట. మరి ఇక్కడ ఎన్ని రోజులు చేస్తారు.. తర్వాత మళ్లీ లొకేషన్ ఎక్కడ అనేది తర్వాత తెలుస్తుంది. అయితే హైదరాబాద్ షెడ్యూల్ లో చరణ్ ఉండకపోవచ్చు. గేమ్ ఛేంజర్ కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు దేశమంతా చేయాలి కాబట్టి.. గేమ్ ఛేంజర్ రిలీజ్ వరకూ మళ్లీ ఈ సెట్ లో అడుగుపెట్టకపోవచ్చు అంటున్నారు. మొత్తంగా ఈ మూవీ నవంబర్ చివరి వారం నుంచి స్టార్ట్ కాబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com