RRR Sequel: ఈ సారి డైరెక్టర్ ఆయనే అంటారా..? మరి హీరోలైనా వాళ్లుంటారా..?
భారత చిత్ర పరిశ్రమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించి, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్ ను కూడా అందుకుంది. అయితే, ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోందని ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కు వినూత్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని టాక్ నడిచింది. ఇప్పుడు ఇదే నిజం అని ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ అయితే రాబోతుంది. సినీ లోకంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డ్ ను అందుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశ పడతారు. ఆ ఘనతను ఆర్ఆర్ఆర్ టీమ్ సాధించింది. భారతీయ సినీ చరిత్రలో ఇదొక మరపురాని ఘట్టంగా ఈ సంఘటన నిలిచిపోయింది. ‘ఆస్కార్’ అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్’ సాకారం చేసింది కాబట్టి.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సీక్వెల్ కి ప్రపంచ వ్యాప్తంగా బజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే దీనిపై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ క్రియేట్ అయింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్ర సీక్వెల్ పై వార్తలు వచ్చినపుడు మళ్లీ రాజమౌళినే దర్శకుడని భావించారు. కానీ ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నామని అప్పట్లో చిత్ర రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అంతే కాదు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ స్ర్కిప్ట్ పై చర్చలు జరుగుతున్నాయని కూడా చెప్పారు. దీంతో తాజాగా ఓ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఈ సీక్వెల్ ను చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రచారానికి గల కారణాలు ఏమైనప్పటికీ ఈ విషయంపై మాత్రం ఇప్పుడు అభిమానులంతా చర్చించుకుంటున్నారు. 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ కు డైరెక్టర్ మారినట్టే.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా మారతారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లిద్దరూ లేకుండా సీక్వెల్ ఎలా ఉంటుంది.. అంటూ అంతా పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దాదాపు హీరోల విషయంలోనూ మార్పు ఉండొచ్చన్న వాదన కూడా ఈ సమయంలో బాగానే వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకూ ఈ విషయంపై క్లారిటీ రాదని మరికొందరు చెబుతున్నారు.
ఇక 'ఆర్ఆర్ఆర్' విషయానికొస్తే తారక్, చెర్రీతో పాటు అలియా భట్, సైఫ్ అలీఖాన్ వంటి స్టార్ నటులు నటించిన ఈ సినిమా దాదాపూ వెయ్యి కోట్లకు పైగానే వసూలు చేసింది. భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ.. అభిమానులకు ఫుల్ ట్రీట్ అందించింది. దీంతో అనతికాలంలోనే బ్లాక్ బస్టర్ ట్యాగ్ ను సొంతం చేసుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com