Pushpa 2 Update: డిసప్పాయింట్ అవుతోన్న బన్నీ ఫ్యాన్స్
'పుష్ప: ది రైజ్' భారీ విజయం తర్వాత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ మాస్టర్ మైండ్ సుకుమార్ 'పుష్ప 2: ది రూల్' తో వస్తున్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అయితే ఇటీవలి కాలంలో 'పుష్ప 2: ది రూల్'కి సంబంధించిన షూటింగ్ వేగం దాని పురోగతిపై ఫ్యాన్స్ అత్యంత ఆసక్తి కనబరుస్తుండగా.. తాజాగా ఓ డిసప్పాయింటెడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం 30-40 శాతం మాత్రమే చిత్రీకరణ జరుపుకున్నట్లు సమాచారం. లేటెస్ట్ గా వచ్చిన ఈ ప్రకటన అభిమానులను ఎంతగానో నిరాశకు గురిచేస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే సినిమాని పూర్తి చేయడానికి ఇంకా చాలా నెలలు పట్టవచ్చని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
'పుష్ప 2'లోనూ రష్మిక మందన్న అల్లు అర్జున్ కో రొమాన్స్ చేయనుంది. ఆమెతో పాటు ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ లాంటి ఇతర నటీనటులు కూడా పలు పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ పాన్-ఇండియన్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త.
ప్రస్తుతం మోస్ట్ అవేటెడ్ లిస్ట్ లో ఉన్న మూవీస్ లలో 'పుష్ ప2' కూడా ఒకటి. ఇక ఈ సినిమాలో ఇప్పటికే మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ నటిస్తుండగా.. ఇటీవలే సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో అతిథి పాత్రలో కనిపిస్తాడని.. ఆ హీరో సూర్య అని కొత్తగా ప్రచారం జరుగుతోంది. అదే గనక నిజమైతే.. ఈ సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశం ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక 'పుష్ప 2' వచ్చే షెడ్యూల్ లో భాగంగా గుంతకల్లు నల్లమల అడవుల ప్రాంతంలో ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే విషయాల్లో ఒకటైన 'పుష్ప' సినిమాలోని ఐటెం సాంగ్ పైనా పలు కథనాలు వస్తున్నాయి. పార్ట్ 1 సమంతతో హాట్ స్టెప్పులు వేసి ఉర్రూతలూగించిన సుకుమార్.. ఇప్పుడు 'పుష్ప 2'లోనూ దాన్ని మించేలా ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తనదైన స్టైల్లో ఎప్పటిలాగానే ఐటమ్ సాంగ్‌కి అదిరిపోయే ట్యూన్ ఇచ్చేశారని, అందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా నటించనుందనే టాక్ కొన్నాళ్ల ముందు వరకు వినిపించింది. అయితే రీసెంట్ అప్ డేట్స్ ప్రకారం ఓ ఐటెమ్ సాంగ్ కోసం 'పుష్ప 2' టీమ్ ఏకంగా రూ.7 కోట్లను ఖర్చు పెడుతుందనే టాక్ వినిపిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com