Vishwambhara : విశ్వంభర చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ ఇదే !

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భారీ బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. ఈ మూవీ చిత్రీకరణ, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం మిగిలి ఉన్న కొన్ని పాటల షూటింగ్ త్వరలోనే పూర్తి చేయనున్నారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని జనవరి 10నే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ గా నటిస్తున్నాడు. ‘అంజి’ తర్వాత దాదాపు ఇరవై ఏళ్ళకు చిరు నటిస్తున్న మరో సోషియో ఫాంటసీ మూవీ ఇదే అవడం విశేషం. మరి ఈ సినిమా మెగాస్టార్ కు ఏ రేంజ్ లో సక్సెస్ అందిస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com