మహేష్-త్రివిక్రమ్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!

మహేష్-త్రివిక్రమ్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. వీరి కాంబినేషన్ నుంచి వస్తున్న మూడో సినిమా కావడం విశేషం. ఈ రోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాతో మహేశ్‌ తో కలిసి మరోసారి సందడి చేయనుంది పూజా హెగ్డే. ఇక ఎ.ఎస్‌.ప్రకాశ్‌ ఆర్ట్‌ డైరక్టర్‌గా, నవీన్‌ నూలి ఎడిటర్‌గా, మది సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు.. పరుశురామ్‌ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' చిత్రంలో నటిస్తున్నారు.Tags

Read MoreRead Less
Next Story