Lavanya Tripathi: వరుణ్‌తో పెళ్లి.. ఫోటోతో క్లారిటీ ఇచ్చేసింది...!

Lavanya Tripathi: వరుణ్‌తో పెళ్లి.. ఫోటోతో క్లారిటీ  ఇచ్చేసింది...!
Lavanya Tripathi: 'మిస్టర్' వరుణ్ తేజ్ 'అంతరిక్షం'లో నటిస్తే అలా అనేస్తారా.. కెమిస్ట్రీ బావున్నంత మాత్రాన కధలల్లేస్తారా అని సొట్టబుగ్గల బ్యూటీ లావణ్య త్రిపాఠి.

Lavanya Tripathi: ఒకటి రెండు సినిమాల్లో హీరోహీరోయిన్ కలిసి నటిస్తే.. ఆ సినిమాల్లో ఇద్దరి పెయిర్ బాగుంటే ఆ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ స్టోరీలు అల్లేయడం సోషల్ మీడియాలో కామన్ అయిపొయింది. ఇది హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల విషయంలో కూడా జరిగింది. 'మిస్టర్', 'అంతరిక్షం' సినిమాల్లో కలిసి నటించారు వీరిద్దరూ.. అప్పుడే ఇద్దరి మధ్య లవ్ ఉందని, త్వరలో పెళ్లి చేసుకుబోతున్నారంటూ రూమర్లు తెగ వచ్చేశాయి. దీనికి తోడు నిహారిక పెళ్లికి లావణ్య హాజరు కావడంతో ఆ రూమర్లకు మరింత ఆస్కారం ఇచ్చినట్లైంది.

ఇక నిన్న జనవరి 19 వరుణ్ తేజ్ బర్త్‌డే కావడంతో సెలబ్రేషన్స్ కోసం బెంగుళూరు వెళ్ళాడు.. అక్కడి ఫోటోలు కూడా షేర్ చేశాడు. కానీ లావణ్య కోసమే వరుణ్ బెంగళూరు వెళ్లాడని, ఆమె కోసం ఓ డైమండ్ రింగ్ కూడా కొన్నాడని సోషల్ మీడియాలో వార్తలు హాల్ చల్ చేశాయి. ఈ క్రమంలో లావణ్య ఫోటోలతో ఈ వార్తలకి ఎండ్ కార్డు వేసింది. తాను డెహ్రాడూన్‌లో ఉన్నానంటూ ఫ్యామిలీతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది లావణ్య. ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తున్నానని కొన్ని ఫోటోలను జత చేసింది. ఆమె షేర్ చేసిన కొత్త ఫోటోలతో వరుణ్‌తో ప్రేమ, పెళ్లి అంతా వట్టిదేనని క్లారిటీ ఇచ్చినట్టు అయింది.

Tags

Read MoreRead Less
Next Story