సినిమా

Lavanya Tripathi: నీ ఎఫర్ట్ 110 పర్సెంట్.. సూపర్ వరుణ్: లావణ్య ట్వీట్ వైరల్

Lavanya Tripathi: వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది..

Lavanya Tripathi: నీ ఎఫర్ట్ 110 పర్సెంట్.. సూపర్ వరుణ్: లావణ్య ట్వీట్ వైరల్
X

Lavanya Tripathi: వరుణ్ తేజ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ఘనీ ఏప్రిల్ 8న విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. విమర్శకుల నుంచి ప్రశంసలందుకుంటోంది. ఈ చిత్రం గురించి వరుణ్ బెస్ట్ ఫ్రెండ్ నటి లావణ్య త్రిపాఠి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఘనీ టీమ్ కి శుభాకాంక్షలు. వరుణ్.. మీరు మీ పాత్రకు 110% ఇచ్చారు. మీరు చేసిన కృషికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని లావణ్య ట్వీట్ చేసింది.

కాగా, వరుణ్, లావణ్య డేటింగ్ లో ఉన్నారని ఇదివరకే ప్రచారం జరిగింది. తాజాగా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా చిత్ర పరిశ్రమలో జోరుగా వినిపించింది. దానికి తోడు వరుణ్ చెల్లెలు నిహారిక పెళ్లికి కూడా లావణ్యకు స్పెషల్ ఇన్విటేషన్ అందింది.. దాంతో ఈ రూమర్లు మరింత ఊపందుకున్నాయి.

వరుణ్, లావణ్య.. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి పనిచేశారు.. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఏదో నడుస్తోంది అని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

తాజాగా ఆమె వరుణ్ నటించిన ఘనీ మూవీపై చేసిన స్పెషల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే వరుణ్ నటిస్తున్న అనిల్ రావిపూడి చిత్రం F3 మే 27న రిలీజ్ కానుంది.

Next Story

RELATED STORIES