Salman Khan : సల్మాన్‌ను 2018 నుంచే చంపడానికి ప్లాన్.. ఆ 2 సార్లు మిస్..

Salman Khan : సల్మాన్‌ను 2018 నుంచే చంపడానికి ప్లాన్.. ఆ 2 సార్లు మిస్..
X
Salman Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను రెండు సార్లు చంపడానికి ప్రయత్నించామన్నాడు లారెన్స్ బిష్నాయ్

Salman Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను రెండు సార్లు చంపడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యామని గ్యాంగ్స్‌టర్ లారెన్స్ బిష్నాయ్ తాజాగా వెల్లడించాడు. అయితే ఈ రెండు సార్లు కూడా సల్మాన్ తృటిలో తప్పించుకున్నట్లు తెలిపాడు. సల్లు భాయ్‌ను చంపడానికి 4 లక్షల విలువజేసే ప్రత్యేక రైఫిల్‌ను కొనుగోలు చేసినట్లు చెప్పాడు.

బిష్నాయ్ గ్యాంగ్‌లోని సంపత్ నెహ్రాను సల్మాన్‌ను చంపడానికి ముంబాయికి పంపించామన్నాడు. అదే సంవత్సరంలో సంపత్ నెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. సల్మాన్ జింకను వేటాడిన విషయం తెలిసిందే.. అయితే బిష్నాయ్ సామాజిక వర్గంలో జింకకు పవిత్ర స్థానం ఉన్నందున సల్మాన్ ఖాన్‌ను చంపాలనుకున్నాడట.

సిధ్దూ మూసేవాలాను హత్య చేసిన తరువాత రోజే సల్మాన్ ఖాన్‌కు బిష్నాయ్ గ్యాంగ్ చంపుతామని లేఖ పంపించింది. "సలీం ఖాన్, సల్మాన్ ఖాన్.. సిద్ధూ మూసేవాలాను చంపినట్లే మిమ్మల్ని చంపుతామని లేఖలో హెచ్చరించాడు.

Tags

Next Story