Chandramukhi 2: ' లారెన్స్ రాయల్ లుక్ రివీల్.. రిలీజ్ డేటూ వచ్చేసింది

Chandramukhi 2:  లారెన్స్ రాయల్ లుక్ రివీల్.. రిలీజ్ డేటూ వచ్చేసింది
చంద్రముఖి 2లో లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

'ముని','కాంచన' సినిమాలతో ప్రేక్షకులను నవ్వించి, భయపెట్టించిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కమ్‌ హీరో రాఘ‌వా లారెన్స్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పి. వాసు డైరెక్షన్ లో మోస్ట్ ఎవెయిటెడ్‌ మూవీగా రాబోతున్న 'చంద్రముఖి 2'కు సంబంధించి ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న లేటెస్ట్ అప్ డేట్ రానే వచ్చింది. ఈ మూవీలోని లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అంతే కాదు లారెన్స్ ఈ సినిమాలో లారెన్స్ వెట్టియాన్ రాజాగా కనిపించనున్నట్టు కూడా మేకర్స్ అతని క్యారెక్టర్ ను రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ లుక్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుటుంది. వీటితో పాటు 'చంద్రముఖి 2' రిలీజ్ డేట్ నూ ఖరార్ చేశారు. గణేష్ చతుర్థి సందర్భంగా ఈ సినిమాను సెప్టెంబర్ 15, 2023న రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు.

అంతకుముందు 'చంద్రముఖి 2'లోని లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై అప్ డేట్ ఇచ్చిన మేకర్స్.. జూలై 31న ఫుల్ పోస్టర్ ను లాంఛ్ చేయనున్నట్టు తెలిపారు. ఈ పోస్టర్ లో లారెన్స్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ ను మాత్రమే చేశారు. చేతిలో ఖఢ్గం పటుకుని కనిపిస్తోన్న లారెన్స్ ఫొటోకు బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా రివీలైన ఫుల్ పోస్టర్ ను గమనిస్తే... లారెన్స్ రాజసం ఉట్టిపడేలా రాజు వేషధారణలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. కాగా చంద్రముఖి 2ను తమిళంతోపాటు తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ విన్నర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

ఇక 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్ పోస్టర్ ను షేర్ చేసిన లైకా ప్రొడక్షన్స్.. ఈ మూవీ వినాయక చవితికి రిలీజ్ కానుందని వెల్లడించింది. ఇదిలా ఉండాగా ఈ సినిమాలో లారెన్స్ సరసన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టైటిల్ లుక్ పోస్టర్ మూవీపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. సుభాస్కరన్ సమర్పణలో వస్తోన్న 'చంద్రముఖి 2'లో లెజెండరీ కమెడియన్ కమెడియన్ సైతం కీలక పాత్రలో నటిస్తున్నాడు.


Tags

Read MoreRead Less
Next Story