Karate Kalyani : కరాటే కళ్యాణికి నోటీసులు.. స్పందించకపోతే చట్టపరమైన చర్యలు

Karate Kalyani : సినీ నటి కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ చిన్నారి దత్తత వ్యవహరం హాట్ టాఫిక్‌గా మారింది. కళ్యాణి ఇంట్లో చైల్డ్ లైన్ అధికారులు దాడులు జరిపి అక్రమంగా పాపను పెంచుకుంటున్నారని తేల్చారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. గతంలోనూ కళ్యాణికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఆ నోటీసులకు ఆమె స్పందించలేదని, ఈ నోటీసులపై స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ కలెక్టర్ హెచ్చరించారు.
కాగా తనపై వచ్చిన ఆరోపణలను కరాటే కళ్యాణి ఖండించారు. పాప తల్లిదండ్రులతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. తనపై వచ్చిన నిందలు నిజం కాదని నిరూపించేందుకే వారిని తీసుకొచ్చినట్లు చెప్పారు. పాపను తాను దత్తత తీసుకోలేదని.. ఏడాది వరకు దత్తత తీసుకోలేనని తనకు తెలుసునని కరాటే కళ్యాణి అన్నారు. పాపకు ఏడాది వయసు వచ్చాక దత్తత తీసుకుందామని అనుకున్నామని తెలిపారు.
పిల్లల్ని అమ్ముకునే హేయమైన స్థితిలో తాను లేనని కరాటే కళ్యాణి స్పష్టం చేశారు. కలెక్టర్‌ను కలవనున్నట్లు తెలిపారు. తనపై అనవసరంగా నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఫైట్ చేస్తాను, నిలదీస్తానని... కొన్ని రాజకీయ శక్తులు కూడా తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అయినా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. byte
కాగా కరాటే కల్యాణి ఇంట్లో ఓ చిన్నారిని గుర్తించిన చైల్డ్ లైన్ అధికారులు.. ఆ చిన్నారి ఎవరు...ఎక్కడి నుంచి వచ్చింది వంటి వివరాలపై ఆరా తీస్తున్నారు. కరాటే కళ్యాణి తల్లి, సోదరుడిని ప్రశ్నించినా సరైన సమాధానాలు రాకపోవడంతో.. కళ్యాణిని ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com