Allu Arjun : అల్లు ఆర్జున్ కి ఆర్టీసీ నుంచి షాక్..!

Allu Arjun : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపినట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇటీవల అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో ప్రకటనపై అభ్యంతరాలు ఉన్నట్టుగా సజ్జనార్ వ్యక్తం చేశారు. ప్రసారం అవుతున్న ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది.
దీనిపైన ప్రయాణికులు, ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. సంస్థని కించపరిస్తే సహించేది లేదని, ప్రజారవాణాను ప్రోత్సహించే ప్రకటనలో నటులు నటించాలని అన్నారు. టీఎస్‌ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది. అందుకే నటుడికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసులు ఇచ్చామని అన్నారు. ఇక బస్ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై, బస్సుల్లో, బయట పాన్, గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నామని సజ్జనార్ అన్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com