Leo : మరో 100 థియేటర్ల లో రీ రిలీజ్..!

Leo : మరో 100 థియేటర్ల లో రీ రిలీజ్..!
భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విజయ్ 'లియో'.. త్వరలోనే ఓటీటీలోకి

అక్టోబర్ 19 న దసరా పండుగ సందర్భంగా విడుదలైన చిత్రం 'లియో'. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 600 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్‌'ను అధిగమించి 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది.

ఇప్పుడు, తమిళ ఫిల్మ్ సర్కిల్స్ నుండి వస్తున్న తాజా అప్డేట్‌ల ప్రకారం, 'లియో' తమిళనాడు అంతటా 100కి పైగా స్క్రీన్‌లలో రీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. రీ రిలీజ్ ప్లాన్ వెనుక కారణం టిక్కెట్ కౌంటర్లలో మంచి వసూళ్లను సాధించగల మంచి సినిమాలు ఏమీ లేకపోవడమే. 5వ వారంలో కూడా 'లియో' బాక్సాఫీస్ వద్ద మంచి రన్‌ను కొనసాగిస్తోంది. త్రిష, సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించిన లియోను ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

లోకేశ్- విజయ్.. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో 'మాస్టర్' అనే సినిమా వచ్చింది. ఆ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టకోలేకపోయింది. అయితే లోకేష్‌కు యూనివర్స్‌లో ఈ సినిమా ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. మొదట రెండు రోజులు ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపించినా.. ఆ తర్వాత మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 500 కోట్ల గ్రాస్‌ను అందుకుని వావ్ అనిపించింది. అంతేకాదు తెలుగులో బ్రేక్ ఈవెన్‌ కూడా పూర్తి చేసుకుని లాభాల బాటలో పయనిస్తోంది. విజయ్ కెరీర్ లో తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటి సారిగా 20 కోట్ల షేర్ మార్క్ అందుకుని కేక పెట్టించింది.

ఇప్పటికే మంచి కలెక్షన్స్‌తో అదరగొట్టిన ఈ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. లియో విడుదలైన నెల లోపలే వస్తుందని ముందు నుంచే ప్రచారం జరగ్గా.. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. 'లియో' మూవీ నవంబర్ 23న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రీమియర్ కానుంది. ఇక లియో ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఓటీటీలో మాత్రం కాస్తా ఎక్కువ నిడివితో వస్తుందని టాక్ నడుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే ఈ సినిమా దర్శకుడు లోకేష్ క్లారిటీ ఇచ్చారు.


Tags

Read MoreRead Less
Next Story