'ఆంటోనీ దాస్'గా సంజయ్ దత్ పాత్రను రివీల్ చేసిన 'లియో' టీమ్
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ పుట్టినరోజు ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు ఆయనకు పెద్ద సర్ ఫ్రైజే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన టాలీవుడ్ లో చేసే సినిమాలకు సంబంధించి పలు పోస్టర్లను వదులుతున్నారు. ఇప్పటికే ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ కాంబినేషన్ లో రాబోతున్న 'డబుల్ ఇస్మార్ట్' నుంచి మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ సినిమాలో ఆయన పోషిస్తున్న 'బిగ్ బుల్' పాత్రను ఈ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. ఇప్పుడు మరో సినిమా మేకర్స్ ఆయన మరో సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. తాజాగా తమిళంలో ఆయన చేస్తున్న 'లియో' సినిమా నుంచి సంజయ్ పోస్టర్ ను వదిలారు మేకర్స్.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ దళపతి, త్రిష జంటగా నటిస్తున్నారు. లలిత్ కుమార్ - జగదీశ్ పళనిస్వామి నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ క్యారెక్టర్ రివీల్ అయింది. ఈ మూవీలో ఆయన ఆంటోని దాస్ అనే కీలకమైన పాత్రను పోషించనున్నట్టు చిత్ర నిర్వాహకులు పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ పోస్టర్ వీడియో మొదటగా పెద్ద గద్దతో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అంతా జనం గుమికూడి ఉండడం.. అంతలోనే తన గ్యాంగ్ తో బయటికొస్తున్న సంజయ్.. ఇంటెన్స్ క్రియేట్ చేసేలా ఉండేలా ఉన్న ఈ ఫస్ట్ గ్లింప్స్ వీడియో.. ఆడియెన్స్ ను సినిమాకు రప్పించేదిలా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ వీడియోను షేర్ చేసిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్.. "ఆంటోనీ దాస్‍ను మీట్ అవండి. సంజయ్ దత్ సర్.. మా నుంచి మీకు స్మాల్ గిఫ్ట్! మీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది” అని ట్వీట్ చేశారు. దాంతో పాటు హ్యాపీ బర్త్ డే సంజయ్ దత్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టారు. 'లియో'లో సంజయ్ దత్ క్యారెక్టర్.. ఆంటోనీ దాస్‍ను వీడియో ద్వారా పరిచయం చేశారు లోకేశ్. ఈ సినిమాతో మరోసారి గ్యాంగ్‍స్టర్‌గా కనిపించబోతున్నారు సంజయ్. చాలా స్టైలిష్‍గా ఉన్నారు. ఇక అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా పవర్‌ఫుల్‍గా ఉంది.
'లియో'లో విజయ్, త్రిషతో పాటు అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీఖాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 19వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ యూనిట్ నిర్ణయించింది. లెవెన్ స్ట్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మనోజ్ పరమహంస 'లియో' మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.
Meet #AntonyDas 🔥🔥
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) July 29, 202
A small gift from all of us to you @duttsanjay sir! It was indeed a pleasure to work with you!🤜🤛#HappyBirthdaySanjayDutt ❤️#Leo 🔥🧊 pic.twitter.com/UuonlCF3Qa
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com