త్రిష పై లియో విలన్ అసభ్యకర వ్యాఖ్యలు.. ఎవరీ మన్సూర్ అలీఖాన్

త్రిష పై లియో విలన్ అసభ్యకర వ్యాఖ్యలు.. ఎవరీ మన్సూర్ అలీఖాన్
తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటిచింన చిత్రం లియో. ఈ చిత్రంలో 'విలన్' పాత్ర పోషించిన మన్సూర్ అలీఖాన్, త్రిష కృష్ణన్ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు.

తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటిచింన చిత్రం లియో. ఈ చిత్రంలో 'విలన్' పాత్ర పోషించిన మన్సూర్ అలీఖాన్, త్రిష కృష్ణన్ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు. సినిమాలో త్రిషతో సీన్ ఉందనగానే 'బెడ్ రూమ్ లేదా రేప్' సీన్ ఉంటుందేమో అనుకున్నాను. అలాంటిదేమీ లేకపోగా కనీసం సెట్ లో కూడా త్రిషను చూసే అవకాశం కలగలేదు అని వ్యాఖ్యానించాడు. కాశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు త్రిషను చూసేందుకు కూడా యూనిట్ అనుమతించలేదని ఆయన తెలిపారు.

లోకాష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'లియో' చిత్రంలో విజయ్ తలపతికి జోడీగా మన్సూర్ అలీఖాన్ నటించారు. ఆ సినిమా ద్వారా వచ్చిన ఫేమ్ కంటే ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయాడు. విలేకరుల సమావేశంలో మన్సూర్ త్రిష గురించి మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో వివాదాన్ని రేకెత్తించాయి. అతని వ్యాఖ్యలపై త్రిషతో పాటు పరిశ్రమలోని ఇతర వ్యక్తులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వివాదాలు చుట్టుముట్టిన మన్సూర్ అలీఖాన్ ఎవరో తెలుసుకుందాం...

మన్సూర్ అలీ ఖాన్ 1961 ఫిబ్రవరి 22న తమిళనాడులో జన్మించారు. 62 ఏళ్ల మన్సూర్ నటుడిగానే కాకుండా సంగీత స్వరకర్త, రచయిత మరియు నిర్మాత. సినిమాల్లో సపోర్టింగ్, నెగెటివ్ క్యారెక్టర్స్‌ పోషించడంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. 1991లో వచ్చిన చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ అతడికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.

మన్సూర్ అలీ ఖాన్ అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్ లో యాక్టింగ్ నేర్చుకున్నాడు. అంతే కాకుండా రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షంచుకున్ాడు. త్రిషపై చేసిన వ్యాఖ్యలకు స్సందిస్తూ.. సరదాగా అన్న మాటలను సీరియస్ గా తీసుకుని వివాదాన్ని రేపుతున్నారని అన్నాడు. అలాగే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తన అభిప్రాయాలను వక్రీకరించి తన ప్రతిష్టను దిగజార్చేలా ప్రదర్శించేదుకే ఈ కుట్ర అని అన్నాడు.

మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలకు త్రిష తీవ్రంగా బాధపడ్డారు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో 'అతను నా గురించి చాలా చెడుగా మాట్లాడాడు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇకపై అతడితో సినిమాలు చేయను అని అన్నారు.

మన్సూర్ అలీ ఖాన్ ఈ వివాదాస్పద ప్రకటన తర్వాత 'లియో' దర్శకుడు లోకాష్ కనగరాజ్, గాయని చిన్మయి శ్రీపాద కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పాటు బీజేపీ నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఖుష్బూ సుందర్ కూడా నిరసన తెలిపారు. ఈ విషయమై సీనియర్లతో మాట్లాడి త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags

Next Story