F3 Movie : లైఫ్ అంటే ఇట్టా వుండాలా.. పూజా ఐటెం సాంగ్ వచ్చేస్తోంది..!

F3 Movie : లైఫ్ అంటే ఇట్టా వుండాలా.. పూజా ఐటెం సాంగ్ వచ్చేస్తోంది..!
F3 movie : ఒకప్పుడు సినిమాల్లో ఐటమ్ సాంగ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన ఐటమ్. అందుకోసం క్రేజీ బ్యూటీస్ కూడా ఉండేవారు.

F3 movie : ఒకప్పుడు సినిమాల్లో ఐటమ్ సాంగ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన ఐటమ్. అందుకోసం క్రేజీ బ్యూటీస్ కూడా ఉండేవారు. కొన్నాళ్లుగా ఈ ట్రెండ్ తగ్గింది. నేటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కు అంత ప్రాధాన్యత కనిపించడం లేదు. ఉన్నా.. హీరోయిన్లే చేస్తున్నారు. దీనివల్ల ఐటమ్ గాళ్స్ ఉపాధిపోతున్నా.. హీరోయిన్లు చేయడం వల్ల ఆ పాటకు మరింత క్రేజ్ యాడ్ అవుతోంది.

ఆ క్రేజ్ కోసమే.. టాలీవుడ్ టాప్ బ్యూటీలతో అదిరిపోయే ఐటమ్ సాంగ్ చేయిస్తున్నారు.. అందులో భాగంగానే అనిల్ రావిపూడి డైరక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతోన్న ఎఫ్3 సినిమాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేతో ఐటెం సాంగ్ ప్లాన్ చేశారు.. లైఫ్ అంటే ఇట్టా వుండాలా అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ ని మే 17న ఉదయం 10:08 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు.

ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేసి చిత్రీకరించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్నా, మేహ్రీన్ హీరోయిన్లుగ నటిస్తున్నారు. ఎఫ్2 కి సీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీ పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story