Liger Movie: 'లైగర్'కు ఓటీటీ భారీ ఆఫర్.. అన్ని కోట్లా..?

Liger Movie (tv5news.in)

Liger Movie (tv5news.in)

Liger Movie: లైగర్ సినిమాతో ఇంటర్నేషన్ బాక్సర్ మైక్ టైసన్ తొలిసారి తెలుగు ప్రేక్షకులకు నటుడిగా పరిచయమవుతున్నాడు.

Liger Movie: ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం చాలామంది స్టార్ డైరెక్టర్లు విజయ్ డేట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. పూరీ జగన్నాధ్‌లాంటి డాషింగ్ డైరెక్టర్ కూడా విజయ్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'లైగర్' చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.

చిన్న హీరోగా ప్రారంభమయిన విజయ్ దేవరకొండ కెరీర్.. అర్జున్ రెడ్డితో ఊహించని మలుపు తీసుకుంది. ఈ సినిమా కేవలం విజయ్ కెరీర్‌కు మాత్రమే కాదు.. టాలీవుడ్‌కు కూడా ఓ కొత్త కోణాన్ని చూపించింది. అందుకే పూరీ జగన్నాధ్‌తో తాను తీస్తున్న లైగర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక కొన్నిరోజుల క్రితం విడుదలయిన లైగర్ ట్రైలర్ అందరి అంచనాలను మరింత పెంచేసింది.

లైగర్ సినిమాతో ఇంటర్నేషన్ బాక్సర్ మైక్ టైసన్ తొలిసారి తెలుగు ప్రేక్షకులకు నటుడిగా పరిచయమవుతున్నాడు. అంతే కాకుండా బాలీవుడ్ భామ అనన్య పాండే ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్టు సమాచారం. దానికోసం ఆ సంస్థ.. లైగర్ టీమ్‌కు రూ.60 కోట్లు ఆఫర్ చేసిందట. ఇంకా విడుదల తేదీ కూడా ఖరారు కానీ ఈ సినిమాకు ఇంత భారీ ఆఫర్ రావడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Tags

Next Story