Liger : లైగర్‌ను వెంటాడుతున్న భయాలు..

Liger : లైగర్‌ను వెంటాడుతున్న భయాలు..
Liger : లైగర్ మూవీ హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా అని లైగర్ మేకర్స్ ఆందోళనచెందుతున్నారు.

Liger : లైగర్ మూవీ హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా అని మేకర్స్ ఆందోళనచెందుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో చెప్పారు. విజయదేవరకొండ, అనన్య పాండే, మైక్ టైసన్ కలిసి నటిస్తున్న ఈ మూవీని సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో కరణ్ జోహార్ తెరకెక్కించారు.


  • లైగర్‌లో విజయదేవరకొండ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా నటించాడు. ఆ బాడీ లుక్ రావడం కోసం ఎంతో శ్రమించాడు
  • బాలీవుడ్‌లో పాపులర్ నటి కానప్పటికీ అనన్య పాండేను హీరోయిన్‌గా తీసుకున్నారు
  • బాలీవుడ్‌లో ఒకప్పటి కమెడియన్ నటుడు చుంకీ పాండే కూతురే అనన్య పాండే. చుంకీ పాండే కూడా అతిథి పాత్రలో నటించనున్నారు.
  • లైగర్‌ను తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేశారు. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.
  • బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ కథ ఉండడం వల్ల మైక్ టైసన్‌ను నటించడానికి ఎంతో శ్రమించి ఒప్పించారు మేకర్స్
  • మైక్ టైసన్ మెడ మనకంటే మూడింతలు ఉంటుందట.. షూ సైజ్ 16 అని స్వయంగా విజయదేవరకొండే ఓ ఇంటర్యూలో చెప్పాడు.
  • లైగర్ బడ్జెట్ సుమారు రూ.100 కోట్ల వరకు ఉంటుందని టాక్
  • విజయదేవరకొండతో బాలీవుడ్ చిత్రం చేద్దామని నిర్మాత కరణ్‌జోహర్ ఎప్పుటి నుంచో అనుకుంటున్నాడు. కానీ అనుకోకుండా లైగర్‌ను నిర్మించడానకి ఒప్పుకున్నాడు.
  • లైగర్‌కు సంగీతాన్ని సమకూర్చింది బాలీవుడ్ సంగీత దర్శకులు సునీల్ కశ్యప్, తనిష్క్ భగ్చి
  • బాలీవుడ్ నటుడు రన్వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ ఇచ్చి వైరల్ కాకముందే విజయదేవర కొండ లైగర్ న్యూడ్ పోస్టర్‌తో సెన్సేషన్ సృష్టించాడు
  • లైగర్ సినిమా బుకింగ్స్ ఓపెన్ కాగానే ఫస్ట్ డే రూ.4 కోట్లు వసూలు చేసింది
  • లైగర్ సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి అని లైగర్ టీమ్ ఆందోళన చెందుతోంది
  • బాయ్‌కాట్ లాల్‌సింగ్ చడ్డాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుకున్న విజయదేవరకొండ
  • లైగర్ ఫ్లాప్ అయితే విజయదేవరకొండ ఫిలిం కెరీర్‌కు గట్టి దెబ్బే అంటున్న నెటిజన్స్

Tags

Read MoreRead Less
Next Story