Liger : లైగర్ ట్రైలర్ ఔట్.. రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ హైలైట్..

Liger : లైగర్ ట్రైలర్ ఔట్.. రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ హైలైట్..
Liger : పూరి, విజయదేవరకొండ అభిమానులకు ఈరోజు పండగలా ఉంది.

Liger : పూరి, విజయ్ దేవరకొండ అభిమానులకు ఈరోజు పండగలా ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లైగర్ సినిమా ట్రైలర్ కొన్నినిమిషాల ముందే తెలుగుతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 'క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ' అని విజయదేవరకొండకు తల్లిగా రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.

మైక్ టైసన్ సీన్స్, అనన్యతో రొమాన్స్, తల్లి కొడుకు ఎమోషన్, ఫైట్స్ ఇలా అన్నింటినీ ట్రైలర్‌లో చేర్చారు. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలంలో రిలీజ్ కాబోతుంది. విజయదేవరకొండకు ఇది బాలీవుడ్ ఎంట్రీ అవ్వనుంది.

Tags

Next Story