12 Aug 2022 2:42 PM GMT

Home
 / 
సినిమా / Vijay Devarakonda :...

Vijay Devarakonda : పూణెలో లైగర్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకంటే..?

Vijay Devarakonda : విజయదేవరకొండ, అనన్య పాండే కలిసి దేశవ్యాప్తంగా ముఖ్యంగా నార్త్ ఇండియాలో భారీగా ప్రచారం చేస్తున్నారు.

Vijay Devarakonda : పూణెలో లైగర్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకంటే..?
X

Vijay Devarakonda : ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ సినిమా ప్రమోషన్స్ కూడా లైగర్ తరహాలో జరగలేదు. విజయదేవరకొండ, అనన్య పాండే కలిసి దేశవ్యాప్తంగా ముఖ్యంగా నార్త్ ఇండియాలో భారీగా ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్ స్పాట్స్ అయిన షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్‌లకు వెళ్లి అక్కడ అభిమానులను కలుసుకుంటున్నారు లైగర్ జోడీ. ఇక విజయదేవరకొండకు బాలీవుడ్‌లో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

తాజాగా పూణెలోని ఓ షాపింగ్ మాల్‌లో లైగర్ మూవీని ప్రమోట్ చేయడానికి వెళ్లారు. ఊహించని రీతిలో అభిమానులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వారిని కంట్రోల్ చేయడం సెక్యురిటీకి కూడా ఇబ్బందిగా మారింది. బ్యారికేడ్లను తోసుకొని విజయదేవరకొండ, అనన్య పాండేలను కలవడానికి వస్తున్నారు. దీంతో సెక్యురిటీ విజయ్, అనన్యను అక్కడి నుంచి తరలించేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story