Liger: 'లైగర్' భామ 'అనన్య' కాదు.. పూరీ మదిలో మరో తార

Liger: ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లైగర్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ప్రతి రోజూ ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ చిత్రంపై హైప్‌ని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.. చిత్రానికి సంబంధించిన ఏదో ఒక కీలక పాయింట్‌ని రివీల్ చేస్తున్నారు మేకర్స్. దాదాపు పదేళ్ల క్రితమే ఈ కథను అనుకున్నట్లు చెప్పారు పూరీ ఓ ఇంటర్వ్యూలో.
తన భార్య లావణ్య సలహాతో అర్జున్ రెడ్డి చూశారు పూరీ.. దాంతో లైగర్ చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేయాలని ఫిక్సయిపోయారు.. విజయ్ కూడా కథ వినగానే ఓకే చెప్పారు. అయితే ఇందులో మొదటగా అనుకున్న తార అనన్య పాండే కాదు.. జాన్వీ కపూర్‌ని అనుకున్నారు.
కానీ ఆమె వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయిందట. శ్రీదేవిపై ఉన్న అభిమానంతో ఆమెని తీసుకోవాలనుకుంటే అది కాస్తా రివర్సైంది. కరణ్ జోహార్‌ని కలిసి విషయం చెబితే ఆయనే అనన్యను సూచించారు. ఈ సినిమా తర్వాత ఆమెకు యూత్‌లో ఫాలోయింగ్ పెరుగుతుందని అన్నారు పూరీ.
లైగర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఎక్కడికి వెళ్లినా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు ఈ జంటకు. పుణె, పాట్నా, వడోదర, చండీగఢ్.. ఇలా ప్రతి చోటా నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్స్‌లో షాపింగ్ మాల్స్, గ్రౌండ్స్ నిండిపోతున్నాయి.
రాత్రి 9గంటలకు ప్రోగ్రామ్ అని తెలిసినా 3 గంటలకే భారీ ఎత్తున జనం వస్తున్నారు ఈవెంట్ జరిగే ప్రదేశానికి. ఒకానొక సమయంలో వారిని కట్టడి చేయడం ఎవరితరమూ కావట్లేదు. సినిమా విడుదలైన తరువాత కూడా చిత్రాన్ని ఇదేమాదిరిగా ప్రేక్షకులు ఆదరిస్తారని చిత్ర యూనిట్ విశ్వసిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com