Liju Krishna: డైరెక్టర్‌పై అత్యాచార ఆరోపణలు.. అరెస్ట్ చేసిన పోలీసులు..

Liju Krishna (tv5news.in)
Liju Krishna: మామూలుగా సినీ పరిశ్రమలో మహిళలపై ఎక్కువగా దాడులు జరుగుతుంటాయని, క్యాస్టింగ్ కౌచ్ అనే వ్యవహారం నడుస్తుందని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అయితే అవి కొంతవరకు నిజమే అయ్యిండొచ్చు అని పలు ఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది. తాజాగా ఓ దర్శకుడిపై అత్యాచార కేసు నమోదయ్యింది. ప్రస్తుతం మాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
ఒక్క షార్ట్ ఫిల్మ్‌తో పాపులర్ అయిపోయి.. ఏకంగా నివిన్ పాలీలాంటి స్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్‌ను కొట్టేశాడు లిజు కృష్ణ. 2017లో లిజు తెరకెక్కిన 'ఇమా' అనే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో మంచి హిట్‌గా నిలిచింది. అందుకే కొన్ని ప్రయత్నాల తర్వాత తనకు ఫీచర్ ఫిల్మ్ తెరకెక్కించే ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం నివిన్ పాలీతో కలిసి 'పడవెట్టు' అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు లిజు.
ప్రస్తుతం కేరళలోని కన్నూర్‌లో పడవెట్టు షూటింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో ఆ మూవీ యూనిట్‌లోని ఓ అమ్మాయి లిజు కృష్ణపై అత్యాచార ఆరోపణలు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి లిజును కస్టడీలోకి కూడా తీసుకున్నారు. ప్రస్తుతం లిజు కృష్ణ అరెస్ట్ మాలీవుడ్‌లో సంచలనాన్ని సృష్టించింది. దీంతో తన సినీ కెరీర్ గందరగోళంలో పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com