Khushi Movie : విజయ్ తో సామ్ లిప్ లాక్..?

Khushi Movie : విజయ్ తో సామ్ లిప్ లాక్..?
Khushi Movie : స్టార్ హీరోయిన్ సమంతకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అస్సలు తగ్గడం లేదు.. చైతూతో పెళ్లై విడాకులు తీసుకున్నా.. వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి..

Khushi Movie : స్టార్ హీరోయిన్ సమంతకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అస్సలు తగ్గడం లేదు.. చైతూతో పెళ్లై విడాకులు తీసుకున్నా.. వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.. ఒకవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోలతో జోడీ కట్టేందుకు సమంత ఓకే చెబుతోంది.. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో ఖుషి అనే సినిమా తెరకెక్కుతోంది..శివ నిర్వాణ దర్శకుడు.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో విజయ్.. సమంతల మధ్య రొమాంటిక్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయట. ముఖ్యంగా వీరి మధ్య వచ్చే లిప్ లాక్ సీన్స్ యూత్ ని మెస్మరైజ్ చేస్తాయని టాక్. ఇంటిమేట్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. పెళ్లికి ముందు లిప్ లాక్ సీన్స్ లో నటించిన సమంత.. పెళ్లి తర్వాత కూడా లిప్ లాక్ సీన్ లో నటించింది. చైతూతో విడాకుల తర్వాత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసింది సామ్.

కాగా విజయ్, సామ్ కాంబోలో వస్తోన్న రెండో మూవీ ఖుషి.. అంతకుముందు వీరిద్దరూ కలిసి మహానటి సినిమాలో కలిసి నటించారు.. ఈ సినిమాలో మధురవాణి పాత్రలో సమంత నటించగా, విజయ్ ఆంటోని పాత్రలో విజయ్ దేవరకొండ నటించాడు. అటు సమంత నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story