Alia Bhat: క్యూట్ అలియా.. దింపేసిందిగా గంగూబాయిని.. వీడియో వైరల్

Alia Bhat: క్యూట్ అలియా.. దింపేసిందిగా గంగూబాయిని.. వీడియో వైరల్
Alia Bhatt: ఓ చిన్న పాప గంగూబాయి స్టైల్లో డ్రెస్ వేసుకుని డైలాగ్స్ చెబుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Alia Bhatt: సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్, అలియా భట్ యాక్షన్ అన్నీ కలిపి గంగూబాయి కతియావాడి చిత్రంపై ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తు్న్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

అలియా భట్.. గంగూబాయి వేషధారణలో ఆకట్టుకుంది. అమ్మ ముస్తాబు చేసిందో ఏమో ఓ చిన్న పాప గంగూబాయి స్టైల్లో డ్రెస్ వేసుకుని డైలాగ్స్ చెబుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియో సినిమాలోని అలియా భట్ డైలాగులను ఎలా అనుకరిస్తుందో చూపిస్తుంది.

అలియా మాదిరిగానే తెల్ల చీర, పెద్ద బొట్టుతో క్యూట్‌గా డైలాగులు చెబుతూ ఆకట్టుకుంటోంది. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు చిన్నారి రూపాన్ని చూసి ఫిదా అవుతున్నారు.. తన బాడీ లాంగ్వేజ్ ద్వారా డైలాగులను ఎంత బాగా పలుకుతోంది అని ప్రశంసిస్తున్నారు.

ఈ వీడియో అందమైన అలియా భట్‌కి అంకితం అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. క్యాప్షన్‌లో నటిని ట్యాగ్ చేసింది. ఆ చిన్నారి.. మీ గంగూబాయి.. నమస్తే అంటూ వీడియోను ముగించింది.



Tags

Next Story