Mahesh Babu: అంతటి దు:ఖంలోనూ మహేష్ ముఖంలో చిరునవ్వు.. ఆ క్రెడిట్ బాలయ్యదే..: ఫ్యాన్స్

Mahesh Babu: మహేష్ బాబు కుటుంబంలో ఈ ఏడాది అన్నీ విషాదాలు చోటు చేసుకున్నాయి అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. తండ్రి కృష్ణ మరణంతో కొండంత అండను కోల్పోయారు మహేష్. ఆయన మృతికి సంతాప సూచకంగా టాలీవుడ్ మొత్తం తరలి వచ్చి నివాళులు అర్పించింది.
వారిలో బాలకృష్ణ కూడా ఒకరు. అతను ఈ రోజు కృష్ణ అంత్యక్రియల సమయంలో మహేష్, అతడి తనయుడు గౌతమ్‌తో మాట్లాడుతూ కనిపించారు. తండ్రీకొడుకులను ఉద్దేశించి బాలయ్య మంచి మాటలు చెప్పినప్పుడు మహేష్ అతని కుమారుడు గౌతమ్ పెదాలపై చిరునవ్వు కనిపించింది.
ఈ ఫోటో కొద్ది సేపటికే వైరల్‌గా మారి అభిమానులను ఆనందపరిచింది. మహేష్ చాలా దు:ఖంలో ఉన్నాడు. ఇలాంటి కష్ట సమయంలో అతడి ముఖంలో చిరునవ్వు కనిపించడం చాలా సంతోషం అని అభిమానులు కొంత ఊరట చెందుతున్నారు. మహేష్ ఈ దు:ఖం నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.
That smile makes me happy ❤️❤️#MaheshBabu #Balayya pic.twitter.com/swmd1PNqcB
— 𝙎𝙎𝙈𝘽 𝙁𝙍𝙀𝘼𝙆𝙎 𝙁𝘾 (@ssmb_freaks) November 16, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com