Vishal: హీరో విశాల్‌పై కేసు.. మద్రాసు హైకోర్టు తీర్పు..

Vishal (tv5news.in)
Vishal: తెలుగు కుర్రాడే అయినా.. టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్‌లోనే ఎక్కువ మార్కెట్‌తో పాటు అభిమానులను కూడా సంపాదించుకున్నాడు హీరో విశాల్. తన సినిమాలు ప్రస్తుతం కోలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హిట్లుగా మారిపోయాయి. తాను ఒరిజినల్‌గా తమిళంలో తెరకెక్కించిన సినిమాలనే తెలుగులో కూడా డబ్ చేస్తూ ఉంటాడు. తాజాగా తన సినిమా విషయంలో విశాల్‌పై మద్రాసు హైకోర్టులో కేసు నమోదయ్యింది.
శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన చిత్రమే 'వీరమే వాగై సుడుం'. ఇదే తెలుగులో 'సామాన్యుడు' పేరుతో విడుదలయ్యింది. ఈ సినిమాను విశాల్ తన సొంత విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ద్వారా నిర్మించాడు. అయితే ఈ మూవీ కోసం కోలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నుండి విశాల్ కాస్త అప్పు తీసుకున్నాడట. అయితే ఆ అప్పు తీర్చకుండానే విశాల్.. మూవీని రిలీజ్ చేశాడని, డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను అమ్ముకున్నాడని లైకా.. మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.
విశాల్ తమ దగ్గర నుండి రూ.21.29 అప్పుగా తీసుకున్నాడని లైకా ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టుకు తెలిపింది. అయితే అది రూ. 21 కోట్లు కాదని, రూ. 15 కోట్లని విశాల్ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. దీంతో మద్రాసు హైకోర్టు విశాల్‌కు షాకింగ్ తీర్పు ఇచ్చింది.
ప్రధాన రిజిస్ట్రార్ పేరిట రూ.15 కోట్లును ఏడాది పాటు డిపాజిట్ చేయాలని, కేసు పూర్తయ్యే వరకు దాన్ని రెన్యువల్ చేయాల్సి ఉంటుందని తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఈ మొత్తాన్ని మూడు వారల్లోనే డిపాజిట్ చేయాలని కూడా తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com