Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ నుండి లోబో ఔట్.. వైరల్ అవుతున్న న్యూస్..

Lobo (tv5news.in)
Bigg Boss 5 Telugu: 19 మంది హౌస్‌మేట్స్‌తో మొదలయిన బిగ్ బాస్ సీజన్ 5.. ప్రస్తుతం 12 మందితో కొనసాగుతోంది. ఈ వారం ఇంకొకరిని ఎలిమినేట్ చేయాల్సిన సమయం వచ్చేసింది. ఈ వారం నామినేషన్లలో రవి, లోబో, శ్రీరామచంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, మానస్ ఉన్నారు. అయితే ఇంకా ఎలిమినేషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వకముందే ఈ వారం బిగ్ బాస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో తెలిసిపోయింది.
ఈ సీజన్‌లో సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లొచ్చాడు లోబో. అప్పటినుండే తనపై ప్రేక్షకులలో నెగిటివిటీ మొదలయ్యింది. అసలు తను ఏం గేమ్ ఆడుతున్నాడని సీక్రెట్ రూమ్‌కు పంపినట్టు అని కామెంట్లు మొదలయ్యాయి. లోబో సీజన్ మొదట్లో బాగానే ఎంటర్‌టైన్ చేసినా.. తర్వాత తనకు పెద్దగా స్క్రీన్ పెసెన్స్ లేకుండా పోయింది. సన్నీ, రవి లాంటి ప్లేయర్లు ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంటే లోబో మాత్రం వెనుకబడ్డాడు. అందుకే ఈ వారం లోబో ఎలిమినేట్ అయ్యాడన్న విషయం వైరల్‌గా మారింది.
ఇతర హౌస్‌మేట్స్ లాగా లోబో ఈ మధ్య పెద్దగా ఎంటర్‌టైన్ చేయడానికి ట్రై చేయట్లేదు. టాస్క్‌లలో కూడా తన పార్టిసిపేషన్ అంతంత మాత్రంగానే ఉంది. ఆ వారం నామినేషన్‌లలో ఉన్న ఇతర హౌస్‌మేట్స్‌తో పోలిస్తే లోబో లీస్ట్ ఓట్లతో ఎలిమినేట్ అవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి. చివరి వరకు రవి, లోబో డేంజర్ జోన్‌లో ఉండగా లోబోనే హౌస్ నుండి బయటికి వచ్చేయనున్నాడని టాక్.
ఈవారం దీపావళిని పురస్కరించుకుని బిగ్ బాస్ వేదికపై తారల సందడి నెలకొంది. సుమ లాంటి యాంకర్‌తో పాటు, మెహ్రీన్, శ్రేయ లాంటి హీరోయిన్లు.. సంతోష్ శోభన్ లాంటి హీరోలు బిగ్ బాస్‌లోకి గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చి అందరినీ ఎంటర్‌టైన్ చేయనున్నారు. ఇంతకు ముందు సీజన్ కంటెస్టెంట్లు కూడా ఈసారి బిగ్ బాస్ స్టేజ్‌పై మెరవనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com