Bigg Boss Lobo Remuneration: బిగ్ బాస్ లోబోకు ఎంత రెమ్యునరేషన్ అంటే..

Bigg Boss Lobo (tv5news.in)
Bigg Boss Lobo Remuneration: బిగ్ బాస్ హౌస్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేదాన్ని బట్టే హౌస్‌మేట్స్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి టాస్క్‌లలో చురుగ్గా ఆడినా, అందరు హౌస్‌మేట్స్‌తో సాన్నిహిత్యంగా ఉన్నా ప్రేక్షకులను మెప్పించే విషయంలో మాత్రం వెనకబడడంతో హౌస్‌మేట్స్ ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అలా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన హౌస్‌మేట్ లోబో.
లోబో.. ఒక మంచి కమెడియన్‌గా చాలామంది ప్రేక్షకులకు తెలుసు. తను బయట ఎలా తన కామెడీతో అందరినీ మెప్పించాడో.. హౌస్‌లో కూడా అందరిని అలాగే ఎంటర్‌టైన్ చేశాడు. ఇతర హౌస్‌మేట్స్‌ను మాత్రమే కాదు ప్రేక్షకులను కూడా తాను హౌస్‌లో అడుగుపెట్టిన మొదటిరోజు నుండి ఎంటర్‌టైన్ చేయడం మొదలుపెట్టాడు. కానీ గత కొన్ని రోజులుగా లోబో చాలా డల్ అయిపోయాడు.
తాను చాలా కష్టపడి కెరీర్‌లో పైకి వచ్చానని, బస్తీలో ఉండే కష్టాలన్నీ తాను అనుభవించానని లోబో మాటిమాటికి చెప్తూ ఉండేవాడు. అప్పటినుండే ప్రేక్షకుల్లో తనపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా లోబోకు ఉన్న సపోర్ట్ కొంచెంకొంచెంగా తగ్గుతూ వస్తోంది. ఇక ఈ మధ్య తాను టాస్క్‌లలో అంత యాక్టివ్‌గా లేకపోవడం కూడా తన ఎలిమినేషన్‌కు కారణమయ్యాయి.
బిగ్ బాస్ హౌస్‌లోకి రావడానికి లోబోకు ఎంత పారితోషికం లభించింది అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బిగ్ బాస్ హౌస్‌లో లోబోకు ఒక్కరోజుకు రూ.35 వేల రెమ్యునరేషనల్ అందిందట. అంటే వారానికి రెండున్నర లక్షలు. సెప్టంబర్ 5న బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యింది. అక్టోబర్ 30న లోబో ఎలిమినేట్ అయ్యాడు. అంటే ఇన్ని రోజులకు మొత్తంగా రూ. 20 లక్షల రెమ్యునరేషన్‌ను తీసుకెళ్తున్నాడు లోబో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com