సినిమా

Lobo : మెగాస్టారే పిలిచి మరి ఆఫర్.. లక్కంటే నీదే లోబో..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో ఒక్క ఫోటో దిగితే చాలు అనుకునే సెలబ్రిటీలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.

Lobo : మెగాస్టారే పిలిచి మరి ఆఫర్.. లక్కంటే నీదే లోబో..
X

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో ఒక్క ఫోటో దిగితే చాలు అనుకునే సెలబ్రిటీలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.. అలాంటిది చిరంజీవితో కలిసి నటించే ఆఫర్ వస్తే.. అందులోనూ మెగాస్టారే పిలిచి మరి ఆఫర్ చేస్తే ఆ ఆనందం ఎలా ఉంటుంది.. ఇప్పుడే అంతే ఖుషిలో ఉన్నాడు లోబో... అవును లోబోకి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం వచ్చిందట.. ఈ విషయం ఎవరో కాదు.. స్వయంగా చెప్పాడు.

ఈమధ్యే చిరంజీవి.. లోబోను పిలిచి మరీ నా సినిమాలో ఛాన్స్‌ ఉంది, వచ్చి చేయమని స్వయంగా చెప్పారట.. ఓ టీవీ షోలో పాల్గొన్న లోబో ఈ విషయాన్ని వెల్లడించాడు లోబో.. అయితే అదేదో మాములు పాత్ర కూడా కాదు.. చిరును అంటిపెట్టుకుని ఉండే పాత్రనట.. దీనితో తనకల నెరవేరిందంటూ ఫుల్ ఖుషిలో ఉన్నాడు లోబో... మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తోన్న 'భోళా శంకర్‌' సినిమాలో లోబో నటిస్తున్నాడు.

అయితే ఇందులో అతని పాత్ర ఏంటి అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. కాగా ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే కీర్తి సురేష్ ఓ కీలకపాత్రలో కనిపించనుంది. నవంబర్ మధ్యలో చిత్రీకరణ ప్రారంభించిన చిత్రబృందం ఫస్ట్ షెడ్యూల్‌ను తాజాగా పూర్తి చేసుకుంది. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్‌గా రూపొందుతోంది. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్‌పై అనిల్ సుంకర ఈ మూవీని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.


Next Story

RELATED STORIES