Lokesh Kanagaraj : లోకేష్ డైవర్షన్ కాంబినేషన్స్

Lokesh Kanagaraj :  లోకేష్ డైవర్షన్ కాంబినేషన్స్
X

వరుసగా విజయాలు వస్తే ఏ దర్శకుడైనా కాస్త అతి విశ్వాసంతోనే కనిపిస్తాడు. పైగా షార్ట్ టైమ్ లో ఫేమ్ అయితే ఇది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. ఈ విషయంలో లోకేష్ కనకరాజ్ కూడా మినహాయింపు కాదు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి మూవీస్ తో సౌత్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. బట్ లియోతో షాక్ తిన్నాడు. అంతకు మించి కూలీతో తనలో పస అయిపోయిందా అనిపించేశాడు. అస్సలే మాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో రూపొంది కూలీలో నటించిన స్టార్స్ కు సైతం తన వరస్ట్ రైటింగ్ తో అన్యాయం చేశాడు. కూలీ తర్వాత ఖైదీ 2 ఉంటుందని ముందు నుంచీ చెబుతూ వస్తున్నాడు లోకేష్. బట్ ఇప్పుడు మాట మార్చాడు. ఖైదీ 2 వెనక్కి వెళుతోంది.కూలీ రిజల్ట్ తో అతనిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వాటిని డైవర్ట్ చేయడానికి కొత్త కాంబినేషన్ తెరపైకి తీసుకు వస్తున్నాడు అనే టాక్ వినిపిస్తోంది.

కార్తీ సినిమా కంటే ముందు ఇప్పటి వరకూ అసలు ఊసులోనే లేని రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ ను తెరపైకి తెచ్చాడు. ఖైదీ 2ను పక్కన పెట్టి ఈ ఇద్దరితో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు కోలీవుడ్ లో విపరీతంగా వినిపిస్తున్నాయి. నిజానికి ఈ కాంబోలో సినిమా కోసం చాలామంది ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. లోకేష్ సాధించాడు అనే టాక్ ఉంది. ఆల్రెడీ కమల్ హాసన్ కెరీర్ కు విక్రమ్ తో ఊపిరి పోశాడు. ఇప్పుడు కూలీతో రజినీకి అన్యాయం చేశాడు. దీన్ని కవర్ చేయడానికే కమల్ ను వాడబోతున్నాడు అంటున్నారు కొందరు. అఫ్ కోర్స్ రజినీకాంత్ కు అన్యాయం అనేది ఇప్పుడు అనవసరమైన విషయం. అయినా విక్రమ్ తో పోలిస్తే రజినీని చాలా తక్కువగా చూపించాడు. ఎలివేషన్స్ అయినా యాక్షన్ అయినా చాలా మైనస్ గా కనిపిస్తుంది.

ఏదేమైనా లోకేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్, రజినీ, కమల్ కాంబోలో ఉంటుందనేది స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మించబోతున్నాడు అంటున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీని ఈ నెలలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. తర్వాత రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అటు కమల్ కూడా భారతీయుడు 3ని పూర్తి చేస్తాడు. సో.. ఈ మూవీ షూటింగ్ 2026 ఆరంభంలో ప్రారంభం అవుతుందని చెబుతున్నారు అన్నీ ప్రిపేర్ అయి చేస్తేనే కూలీ నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. మరి సడెన్ గా తెరపైకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంటుందో ఊహలకే వదిలేయాలి.

Tags

Next Story