Lokesh Kanagaraj : రాజమౌళిపై లోకేష్ కనకరాజ్ సెటైర్స్

Lokesh Kanagaraj :  రాజమౌళిపై లోకేష్ కనకరాజ్ సెటైర్స్
X

రాజమౌళి ఇప్పుడు ప్యాన్ వరల్డ్ డైరెక్టర్. జేమ్స్ కేమరూన్ వంటి దర్శకులు కూడా మెచ్చుకున్న దర్శకుడు. తెలుగు సినిమాను ఇండియన్ సినిమా ముఖచిత్రంగా మార్చిన దిగ్గజం. అలాంటి డైరెక్టర్ పై ఈ మధ్యే షైన్ అయిన లోకేష్ కనకరాజ్ వంటి దర్శకుడు సెటైర్స్ వేయడం అంటే కాస్త కామెడీగా ఉంటుంది కదా. అయితే లోకేష్.. జక్కన్న కంటెంట్ పై కాకుండా ఆయన తీసుకునే టైమ్ పై కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో కూలీ చిత్రాన్ని రూపొందించాడు. షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

రీసెంట్ గా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు. కూలీ తర్వాత ఖైదీ 2 ఉంటుందట. ఆ తర్వాత అంతా కోరుకున్నట్టు లియో 2 కాకుండా మాస్టర్ 2 తీయాలనుకుంటున్నట్టు చెప్పాడు. అంతే కాదు.. రజినీకాంత్, కమల్ హాసన్ తో ఓ గ్యాంగ్ స్టర్ డ్రామా రూపొందించాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఈ ఇద్దరినీ ఓల్డ్ ఏజ్ గ్యాంగ్ స్టర్స్ గా చూపేలా తను ఓ కథ రాసుకున్నానని.. ఇద్దరికీ చెప్పానని కూడా అన్నాడు. ఇదే ఊపులో తను రాజమౌళి కంటే చాలా బెటర్ అనేలా కొన్ని కామెంట్స్ చేశాడు.

తన సినిమాలను రాజమౌళి ఆర్ఆర్ఆర్ లాగా ఏళ్ల తరబడి తీయను అన్నాడు. మూడేళ్ల పాటు హీరోలను తన వద్దే అంటి పెట్టుకుని అన్నేళ్ల పాటు వారి గెటప్ లను కాపాడుకునేలా చేయను అని చెప్పాడు. ఎంత పెద్ద స్టార్ అయినా తను 6-8 నెలల లోపే సినిమా పూర్తి చేస్తానని చెప్పాడు.

లోకేష్ చేసిన ఈ కామెంట్స్ కు అతనిపై విమర్శలు వస్తున్నాయి. అన్నేళ్ల పాటు రాజమౌళి టైమ్ తీసుకున్నాడు కాబట్టే.. అతని సినిమాలు వరల్డ్ స్టాండర్డ్స్ లో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. మరి దీనికి జక్కన్న నుంచి కౌంటర్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చేమో. అతనికి ఇవన్నీ పట్టించుకునేంత టైమ్ లేదు కదా ఇప్పుడు.

Tags

Next Story