Lokesh Kangaraj : కూలీ కబుర్లతో ఊరిస్తోన్న లోకేష్ కనగరాజ్

Lokesh Kangaraj :  కూలీ కబుర్లతో ఊరిస్తోన్న లోకేష్ కనగరాజ్
X

వెరీ షార్ట్ టైమ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు లోకేష్ కనగరాజ్. ఫస్ట్ మూవీ మా నగరంతో ఇంప్రెస్ చేసి ఖైదీతో స్పెల్ బౌండ్ చేశాడు. ఆ తర్వాత మాస్టర్, విక్రమ్, లియోతో తనకంటూ ఓ సినీవర్స్ క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా విక్రమ్ తో రోలెక్స్ ను మిక్స్ చేసి కొట్టిన దెబ్బకు బాక్సాఫీస్ బెంబేలెత్తిపోయింది. కనక వర్షం కురిసింది. లియో అంచనాలను అందుకోలేకపోయినా కమర్షియల్ గా బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. ప్రస్తుతం రజినీకాంత్ ను తన లోకేష్ వర్స్ లోకి ఎంటర్ చేశాడు. ఆయనతో కూలీ అనే సినిమా రూపొందిస్తున్నాడు. ప్యాన్ ఇండియా మార్కెట్ ను తనదైన శైలిలో కొత్తగా క్రియేట్ చేసిన లోకేష్ ఈ సారి ఈ కూలీలోకి తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, మళయాలం నుంచి సౌబిన్ ను తీసుకున్నాడు. శ్రుతి హాసన్ ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోంది. అయితే తను ఎవరికి జోడీ అనేది తెలియాలి.

ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తున్నాడు లోకేష్. ఇందులో ఉన్న పాత్రలు కేవలం వారి ఇమేజ్ కోసం తీసుకుని ఆయా భాషల్లో మార్కెట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నవి కావని.. ఆ పాత్రలకు అద్భుతమైన క్యారెక్టరైజేషన్ ఉంటుందని ప్రతి పాత్రకూ బలమైన నేపథ్యం కనిపిస్తుందని చెబుతున్నాడు. రజినీకాంత్ ను మునుపెన్నడూ చూడని కోణంలో ఆవిష్కరిస్తూనే.. ఈ మిగిలిన పాత్రలకూ ప్రత్యేకమైన స్టార్డమ్ వచ్చేలా ఈ క్యారెక్టర్స్ ను క్రియేట్ చేశానంటున్నాడు. ఇక ఈ చిత్రాన్ని 2025 వేసవిలోనే విడుదల చేయబోతున్నాడు. నిజానికి లోకేష్ కనగరాజ్ ప్రీ ప్రొడక్షన్ కు టైమ్ తీసుకున్నా.. ప్రొడక్షన్ చాలా వేగంగా కంప్లీట్ చేస్తాడు. ఆ మధ్య నాగ్ ఎపిసోడ్ ను వైజాగ్ లో చిత్రీకరిస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ లీక్ అయ్యాయి. అప్పటి నుంచి మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

విశేషం ఏంటంటే.. ఈ కూలీ విడుదలైన నెల రోజుల్లోనే.. ఖైదీ 2 సెట్స్ పైకి వెళ్లబోతున్నాడట. ఈ సారి కార్తీ మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తాడనీ.. ఈ ఖైదీలో విక్రమ్ పాత్రలను మిక్స్ చేసే అవకాశాలున్నాయి అంటున్నాడు. ఆ తర్వాత రోలెక్స్ కోసం ఓ సినిమా ఉంటుంది. మొత్తంగా ఒక్క లియో తప్ప.. ఈ పాత్రలన్నీ చివరి కథలో కనిపిస్తాయి. ఆ చివరి కథ ఎప్పుడు అనేది కూడా త్వరలోనే చెబుతానంటున్నాడు లోకేష్.

Tags

Next Story