Loki Season 2 Teaser Out : లోకీ సెకండ్ సీజన్ టీజర్ రిలీజ్

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులను ఉర్రూతలూగించిన Loki తిరిగి వస్తున్నాడు. Loki సీజన్ 2 టీజర్ తాజాగా రిలీజ్ అయింది. మార్వెల్ అభిమానులు తమ సీట్లను రిజర్వ్ చేసుకోవాలని లోకీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ 6న ఈ సిరీస్ రిలీజ్ కానున్నట్లు చిత్ర యునిట్ ప్రకటించింది. ఇందులో.. లోకీ గతంలోకి భవిష్యత్తులోకి అనుకోకుండా ప్రయాణిస్తుంటాడు. ఓ సమయంలో భవిష్యత్తును చూసిన లోకీ మానవ సమాజానికి పెను ముప్పు ఎదురవనుందని తెలుసుకుంటాడు. ఈ ఆపద నుంచి మానవాళిని రక్షించడానికి పోరాటం చేసే కథాంశంతో ఈ సిజన్ తెరకెక్కింది.
ఆయాకాలాల్లోకి లోకీ అనుకోకుండా ప్రవేశించడం అక్కడ జరిగే ఘటనలను తెసుకోవడం ఓ సమస్యగా మారుతుంది. ఈ సమస్యను అధిగమించాలనుకునే ప్రయత్నంలో ప్రపంచమే భవిష్యత్తులో పెపు ముప్పును ఎదుర్కోబోతుందని తెలుసుకుంటాడు. ఈ సీజన్ వైల్డ్ ఎక్స్ పీరియెన్స్ ఇవ్వనుందని చిత్రయునిట్ తెలిపింది. అయితే లోకీ భయంకరమైన సవాళ్లను ఎదుర్కోనున్నాడని పేర్కొన్నారు.
టైమ్ స్లీపింగ్ అనే ఓ కలవరపరిచే సమస్యలో లోకీ ఇరుక్కున్నట్లు తెలిపారు. అందులోనే ప్రపంచం సర్వనాశనం కానుందనే అశాంతికరమైన సత్యాన్ని తెలుకునే సీన్లు సిరీస్ కే హైలెట్ గా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ సీరిస్ ను చూడటానికి సినీ ప్రేమికులు ఎక్కువకాలం వేచిచూడాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 6 న డిస్నీ + లో రిలీజ్ కానుంది.
లోకీగా టామ్ హిడిల్ స్టన్ మరోసారి తన నటనా విశ్వరూపాన్ని చూపినట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. ఈ సీజన్ లో కొత్తనటులు అందుబాటులోకి వచ్చారు. Loki సీజన్ 2ను ప్రతిభావంతులైన దర్శకులు జస్టిన్ బెన్సన్, ఆరోన్ మూర్‌హెడ్, డాన్ డెలీవ్, కస్రా ఫరాహానీలచే చిత్రీకరించబడింది. ఎరిక్ మార్టిన్ ఈ సిరీస్ కు ప్రధాన రచయితగా ఉన్నారు. ఇందులో గుగు మ్బాతా-రా, సోఫియా డి మార్టినో, వున్మీ మొసాకు, యూజీన్ కార్డెరో, రాఫెల్ కాసల్, తారా స్ట్రాంగ్, కేట్ డిక్కీ, లిజ్ కార్, నీల్ ఎల్లీస్ వంటి సమిష్టి తారాగణం ఉంది.
Tags
- Loki Season 2
- loki 2 teaser out
- loki Fan reactions
- loki season 2 trailer
- loki season 2
- loki season 2 teaser
- loki season 2 teaser trailer
- loki season 2 official trailer
- loki season 2 official teaser
- loki season 2 trailer leak
- loki season 2 leak
- loki season 2 trailer official
- loki season 2 trailer marvel
- loki season 2 leaked footage
- loki season 2 first look
- loki season 2 trailer breakdown
- loki season 2 trailer d23
- loki season 2 trailer reaction
- loki season 2 trailer easter eggs
- season 2
- tv5news
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com