సినిమా

Aishwaryaa Rajinikanth : ప్రేమనా.. నో ఛాన్స్: ఐశ్వర్య రజనీకాంత్

Aishwaryaa Rajinikanth : ధనుష్ నుండి విడిపోయిన తర్వాత, ఐశ్వర్య రజనీకాంత్ ప్రేమకు మరో అవకాశం ఇచ్చేదీ లేనిది వెల్లడించింది.

Aishwaryaa Rajinikanth : ప్రేమనా.. నో ఛాన్స్: ఐశ్వర్య రజనీకాంత్
X

Aishwaryaa Rajinikanth : "ప్రేమ అనేది చాలా సాధారణమైన భావోద్వేగం. ఇది ఒక వ్యక్తికి లేదా ఒక వ్యక్తిగత విషయాలకు సంబంధించినది కాదు" అని ఐశ్వర్య రజనీకాంత్ అన్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు, దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ ఇటీవలే నటుడు ధనుష్‌తో తన 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికినట్లు ప్రకటించారు. ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.

జనవరిలో ఐశ్వర్య, ధనుష్ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఇద్దరూ ఆ విషయం గురించి మీడియాలో మాట్లాడటం కానీ లేదా పబ్లిక్ ఫోరమ్‌లలో వ్యాఖ్యానించడం కానీ చేయలేదు. అయితే ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభం చాలా కఠినంగా ఉందని తెలపడంతో పాటు తన జీవితంలో ప్రేమకు మరొక అవకాశం ఇవ్వడం గురించి కూడా వ్యాఖ్యానించింది.

జీవితంలో మనకు కొన్ని కఠినమైన సందర్భాలు ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం ఎన్ని అనుకున్నా ఎలా జరగాలని రాసి పెట్టి ఉంటే అలానే జరుగుతుంది. అది ప్రేమ కావచ్చు... మరొకటి కావచ్చు మనకు ఏది ఉద్దేశించబడిందో అదే మనకు వస్తుంది. "

''ప్రేమ అనేది చాలా సాధారణమైన భావోద్వేగం. వ్యక్తులతో గానీ వ్యక్తిగత విషయాలతో గానీ దానికి సంబంధం లేదు. మనతో పాటు మనం ప్రేమకు ఇచ్చే నిర్వచనం కూడా మారుతుంటుంది.

ప్రేమకు మరో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగినప్పుడు, ప్రేమ తనకు ఓ సాధారణ భావోద్వేగమని తెలిపింది. "నేను మా నాన్నను ప్రేమిస్తున్నాను, మా అమ్మను ప్రేమిస్తున్నాను, నా పిల్లలను ప్రేమిస్తున్నాను. కాబట్టి, ప్రేమను ఏవరో ఒకరికి లేదా ఒక వ్యక్తికి పరిమితం చేయకూడదనేది నా అభిప్రాయం అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య.

ధనుష్, ఐశ్వర్యలకు యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడంతో సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులు షాకయ్యారు.

Next Story

RELATED STORIES