Love Story Movie First Day Collections: లవ్ స్టోరీ ఓపెనింగ్స్ అదుర్స్

Love Story Movie First Day Collections: ప్రస్తుతం ఎక్కడ చూసినా లవ్ స్టోరీ సినిమా సంగతులే వినిపిస్తున్నాయి. రెండు వాయిదాల తర్వాత విడుదలయిన ఈ సినిమాపై ప్రేక్షకులు చాలానే అంచనాలు పెంచేసుకున్నారు. అందుకేనేమో టికెట్లకు ప్రీ బుకింగ్ కూడా తొందరగానే ముగిసిపోయింది. చాలా ప్రదేశాల్లో ఇప్పటికిప్పుడు లవ్ స్టోరీ టికెట్లు దొరకడం కూడా కష్టమయిపోయింది. అక్కినేని హీరో నాగచైతన్య కెరీర్‌లో ఇదే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచినా ఆశ్చర్యం లేదు.
ఇప్పటికే తన ఇతర సినిమాలకంటే లవ్ స్టోరీనే ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో మొదటి స్థానంలో నిలిచింది. లవ్ స్టోరీ మొదటిరోజు 6.94 కలెక్షన్లు సాధించిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఒక ఓవర్సీస్ కలెక్షన్లు కూడా కలిపితే ఈ మూవీ 8 కోట్ల మార్క్‌ను అందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 700 వందలకు పైగా స్క్రీన్‌లలో విడుదలయిన లవ్ స్టోరీకి పోటీగా మరే పెద్ద సినిమా లేకపోవడం దీనికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.
ఇప్పటికే ఈ సినిమా 26.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను చేసింది. చైతు కెరీర్‌లో లవ్ స్టోరీ తర్వాత అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది శైలజారెడ్డి అల్లుడు. 2018లో విడుదలయిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ అందుకున్నా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డునే సొంతం చేసుకుంది. అప్పటికి, ఇప్పటికి చైతు నటన మాత్రమే కాదు స్టోరీ సెలక్షన్ కూడా చాలానే మారింది. అందుకే వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు చైతూ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com