ఆ ఒక్క యాంగిల్ వల్లే చైతూ ఇప్పటి వరకు..

ఆ ఒక్క యాంగిల్ వల్లే చైతూ ఇప్పటి వరకు..
తాతకు మాత్రమే కాదు తండ్రికి కూడా తగ్గ వారసుడని కెరీర్ మొదటి నుండి నిరూపించుకుంటున్నాడు అక్కినేని అబ్బాయి నాగచైతన్య.

తాతకు మాత్రమే కాదు తండ్రికి కూడా తగ్గ వారసుడని కెరీర్ మొదటి నుండి నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అక్కినేని అబ్బాయి నాగచైతన్య. జోష్ లాంటి యూత్‌ఫుల్ మూవీతో సినీ ప్రపంచానికి పరిచయమయ్యాడు చైతూ. ప్రేక్షకులను ఆలోచింపజేసే కథే అయినా ఇతర కారణాల వల్ల జోష్ అంతగా ఆడలేదు. అంతే కాక మొదటి సినిమాలో తన లుక్స్ అంతగా బాలేవంటూ ట్రోలింగ్ కూడా ఎదురైంది.

అప్పటి నుండి తన లుక్స్‌పై మాత్రమే కాదు నటన, స్టోరీ సెలక్షన్‌పైన కూడా ప్రత్యేక ద్రుష్టిపెట్టాడు. తన రెండో చిత్రం ఏమాయ చేసావేను కూడా యూత్‌ఫుల్ కథనే ఎంచుకొని మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసాడు. తన భార్య సమంతతో కలిసి తాను నటించిన మొదటి చిత్రం కూడా ఇదే. వారి కెమిస్ట్రీనే ఏమాయ చేసావే హిట్‌కు ముఖ్య కారణం.

ఇదే వారిద్దరి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్రేక్ కూడా. ఇక దీని తర్వాత పలు ప్రయోగాలు చేసి ఫ్లాపులను ఎదుర్కున్న చైతూ ఇప్పుడిప్పుడే స్టోరీ సెలక్షన్‌లో ఇతర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఒక పక్క అందమైన ప్రేమకథలను ఎంచుకుంటూనే, మరోపక్క వాటిలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక చైతూ ఈ మధ్య తెలంగాణ యాసలో మాట్లాడుతూ మరో కొత్త ప్రయోగాం చేసాడు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య నటించిన లవ్ స్టోరీలో తాను ఒక తెలంగాణ అబ్బాయిగా కనిపించడమే కాక ఆ పాత్రలో ఒదిగిపోవడానికి ఎంతో కష్టపడ్డాడు. ఇది వరకు చేయని డ్యాన్స్, క్యారక్టరైజేషన్ లవ్ స్టోరీ సినిమాను చైతూ కెరీర్‌లో స్పెషల్‌గా నిలిచేలా చేస్తుంది. ముఖ్యంగా నాగచైతన్యలో ఇప్పటివరకు చూడని ఒక కోణాన్ని లవ్ స్టోరీతో అందరికి పరిచయం చేయడం మాత్రం గ్యారెంటీ.

Tags

Read MoreRead Less
Next Story