Trisha : వైరల్ అవుతున్న త్రిష పోస్ట్.. అతని గురించేనా

Trisha :  వైరల్ అవుతున్న త్రిష పోస్ట్.. అతని గురించేనా
X

ఎవర్ గ్రీన్ ఛార్మింగ్ బ్యూటీ త్రిష నాలుగు పదుల వయసులోనూ రెండు పదుల వయసులోలా అదే ఛార్మింగ్ తో కనిపిస్తోంది. ఇప్పటికీ వన్నె తరగని సోయగాలు, నిగనిగలాడే చర్మంతో ఎప్పుడూ షైనింగ్ గా ఉంటోంది. ఈ యేడాది దాదాపు నాలుగైదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. తెలుగు నుంచి విశ్వంభర, తమిళ్ నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్, సూర్య మూవీ ఉన్నాయి. మళయాలం నుంచి రామ్ అనే సినిమా ఉంది. ఇవన్నీ తన రేంజ్ ను మరింత పెంచేవే. అలాగే తన వల్ల ఆ సినిమాల రేంజ్ కూడా మారుతుందని చెప్పొచ్చు.

కొన్నాళ్లుగా తను హీరో విజయ్ తో ప్రేమలో ఉంది అనే రూమర్స్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. అది నిజమా కాదా అనేది వారికే తెలియాలి. అతని కోసం గోట్ మూవీలో ఏకంగా ఐటమ్ సాంగ్ చేసింది అని కూడా చెప్పారు. త్వరలోనే విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చి త్రిషను పెళ్లి చేసుకోబోతున్నాడు అనే టాక్స్ కూడా ఉన్నాయి. ఈ టైమ్ లో త్రిష తన ఎక్స్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. టాప్ ట్రెండింగ్ లో ఉందీ పోస్ట్ తో.

తను సిగ్గుల మొగ్గవుతూ.. చాలా అందంగా ముస్తాబైన ఒక ఫోటో పెట్టి దానికి ‘లవ్ ఆల్వేస్ విన్స్’ అనే క్యాప్షన్ ను జోడించింది. ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది అనే ఈ అర్థం దేని గురించి అనేది అర్థం కానంత సిట్యుయేషన్ అయితే లేదు. కాకపోతే ఏ కాంటెక్ట్స్ లో ఆ మాట వాడిందా అని అంతా బుర్రలు బాదుకుంటున్నారు. అంటే తను విజయ్ ని పెళ్లి చేసుకోవడానికి లైన్ క్లియర్ అయిందనా లేక.. ఇంకేదైనా కారణం ఉందా అని తెగ ఆలోచిస్తున్నారు నెటిజన్స్.

Tags

Next Story