Luckcy Baskar : నెట్ ఫ్లిక్స్ ను ఊపేస్తోన లక్కీ భాస్కర్

థియేటర్స్ లో హిట్ అయిన సినిమాలు ఓటిటిల్లో ఆకట్టుకోవు.. థియేటర్స్ లో ఫెయిల్ అయిన మూవీస్ ఓటిటిల్లో హిట్ అవుతుంటాయి అని అంటుంటారు. కొన్నాళ్లుగా ఈ టాక్ కూడా మారుతోంది. రెండు చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంటోన్న సినిమాలు కనిపిస్తున్నాయి. దీపావళి రోజు విడుదలైన క చిత్రానికి ఓటిటిలోనూ మంచి అప్లాజ్ వచ్చింది. అదే రోజు విడుదలైన లక్కీ భాస్కర్ ఓటిటిలో హిట్ కాదు.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని.. ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ను ఊపేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచి రెండు వారాలుగా ట్రెండింగ్ లో నిలిచింది. 17.8 బిలియన్ వ్యూస్ సంపాదించుకుని అదరహో అనిపించుకుంటోంది.
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై రాని విధంగా 1990స్ లో జరిగిన షేర్ మార్కెట్ స్కామ్ ను బ్యాంకింగ్ సిస్టమ్ కు లింక్ చేస్తూ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీని చాలా కన్విన్సింగ్ గా చెప్పాడు దర్శకుడు వెంకీ. షేర్ మార్కెట్ అనేది చాలామందికి సంక్లిష్టమైన సబ్జెక్ట్. అంత సులువుగా అర్థం కాదు. అలాంటి పాయింట్ ను అందరికీ నచ్చేలా సింపుల్ గా చూపించాడు. అది ఓటిటిలోనూ కనెక్ట్ అయింది. అందుకే వారం రోజులుగా నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తోందీ మూవీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com