Lucky Baskar : లక్కీ భాస్కర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత ..?

Lucky Baskar :  లక్కీ భాస్కర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత ..?
X

లక్కీ భాస్కర్.. సితార బ్యానర్ నుంచి వచ్చిన మరో ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలను.. ఆ కష్టాల్లో నుంచి ఆ కుటుంబం బయటపడ్డ విధానాన్ని 90ల బ్యాక్ డ్రాప్ లో అప్పటి షేర్ మార్కెట్ కుంభకోణానికి ముడిపెట్టి వెంకీ అట్లూరి రూపొందించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. హీరో దుల్కర్ సల్మాన్ కు హ్యాట్రిక్ పడితే.. హీరోయిన్ మీనాక్షి చౌదరికి సోలోగా ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటి వరకూ తను కేవలం సెకండ్ హీరోయిన్ గానే ఎక్కువగా కనిపించింది.

ఇక ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. దీపావళి రోజు గట్టి పోటీ ఉన్నా.. లక్కీ భాస్కర్ ప్రీమియర్స్ కే అద్భుతమైన స్పందన వచ్చింది. రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ.. వీక్ డేస్ లోనూ సత్తా చాటిన లక్కీ భాస్కర్ వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 71.2 కోట్లు వసూలు చేసి అదరగొట్టింది.

దర్శకుడు వెంకీ అట్లూరి ఇదే బ్యానర్ లో ఇంతకు ముందు చేసిన సార్ మూవీ ఓవరాల్ గా 100 కోట్లు వసూళ్లు సాధించింది. లక్కీ భాస్కర్ కూడా ఈజీగానే 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవుతుందంటున్నారు. మొత్తంగా ఫస్ట్ వీక్ 71.2 కోట్లు వసూలు చేసింది లక్కీ భాస్కర్.

Tags

Next Story