Lucky Baskar : నిర్మాతలకు కిక్ ఇచ్చిన లక్కీ భాస్కర్

మద్యం, డ్రగ్స్ కంటే ఎక్కువ కిక్ ఇచ్చేది మనీ అని గ్రహించిన తర్వాతే లక్కీ భాస్కర్ లెక్కలు మారాయి. అతనూ డబ్బు సంపాదించాకే సమాజంలో హోదా పెరిగింది. మరి సినిమాలో హీరోగా అతను మాత్రమే సంపాదిస్తే నిర్మాతలకు ఆ కిక్ రాదు కదా. అందుకే నిర్మాతలకు కూడా భారీ కిక్ ఇచ్చాడు లక్కీ భాస్కర్. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ తో సత్తా చాటింది. నాలుగు సినిమాల మధ్య సాలిడ్ బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ అయింది.
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి యూనానిమస్ బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చింది. సింపుల్ స్టోరీతో ఎగ్జైటింగ్ మూమెంట్స్ ను యాడ్ చేస్తూ.. ఆర్థిక ఇబ్బందులతో హీరో పడే పెయిన్ ను ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తూ అతను కష్టాల్లో నుంచి బయట పడాలని ప్రతి ఒక్కరూ అనుకునేలా చేయడంలో వెంకీ అట్లూరి సక్సెస్ అయ్యాడు. దుల్కర్, మీనాక్షి జంట ఆడియన్స్ కు బాగా నచ్చింది. వాళ్ల అద్భుత నటనతోనే ఈ కథ మరింతగా రక్తి కట్టింది. అందుకే లక్కీ భాస్కర్ నిర్మాతలకు డబ్బు కిక్ ను ఇస్తూ ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 12.7 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ అయింది. ఈ కలెక్షన్స్ డే బై డే పెరుగుతూనే ఉంటాయని వేరే చెప్పక్కర్లేదు.
మొత్తంగా దుల్కర్ కు తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ పడ్డాయ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com