Lucky Baskar : కలెక్షన్స్ లో లక్కీ భాస్కర్ దూకుడు

Lucky Baskar :  కలెక్షన్స్ లో లక్కీ భాస్కర్ దూకుడు
X

ఈ దీపావళికి విడుదలైన మూవీస్ లో యూనానిమస్ బ్లాక్ బస్టర్ గా టాక్ తెచ్చుకున్న సినిమా లక్కీ భాస్కర్. ఒక యూనిక్ సబ్జెక్ట్ తో డబ్బు చుట్టూ తిరిగే మిడిల్ క్లాస్ స్టోరీతో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ రిజల్ట్ ఇచ్చేశారు. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంట చూడముచ్చటగా ఉందంటున్నారు. క్లిష్టమైన షేర్ మార్కెట్ వ్యవహారాన్ని సరళంగా మార్చి సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఈమూవీతో తెలుగులో దుల్కర్ కు హ్యాట్రిక్ పడింది. మీనాక్షికి సోలో హీరోయిన్ గా ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా లక్కీ భాస్కర్ నే చెప్పాలి. ఇప్పటి వరకూ తను సెకండ్ హీరోయిన్ గానే ఎక్కువగా కనిపించింది.

ఫస్ట్ డే 12 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన లక్కీ భాస్కర్ రెండో రోజు మరింత ఎక్కువ వసూళ్లతో దూకుడు పెంచింది. దీపావళి రోజు లక్కీ భాస్కర్ తో పాటు 'క'తో పాటు అమరన్, బఘీర చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో అందరికంటే ఎక్కువ బెస్ట్ అనిపించుకున్న సినిమా లక్కీ భాస్కర్. అందుకే రెండో రోజు కలెక్షన్స్ పెరిగాయి. రెండో రోజు 26.2కోట్లు వసూలు చేసిందీ మూవీ. అటు ఓవర్శీస్ లో కూడా హాఫ్ మిలియన్ కు దగ్గరా వచ్చింది. ఈ వీకెండ్ తో అక్కడ మిలియన్ మార్క్ వరకూ వెళుతుందనుకోవచ్చు. ఈ రెండు రోజుల్లో లక్కీ భాస్కర్ కలెక్షన్స్ డబుల్ అయ్యే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది.



Tags

Next Story