Lucky Bhaskar Vs Ka : దీపావళి లక్కీ భాస్కర్ వర్సెస్ క

ఒకప్పుడుతెలుగు వాళ్లు దీపావళి పంగను పెద్దగా పట్టించుకోలేదు. ఆ టైమ్ లో తమిళ్ డబ్బింగ్ మూవీస్ సందడి చేసేవి. బట్ కొన్నాళ్లుగా ఈ పండగను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ టైమ్ కు మన సినిమాలు కూడా విడుదల చేస్తున్నారు. ఈ సారి ఐదు సినిమాలు బరిలో ఉన్నాయి. వీటిలో రెండు డబ్బింగ్ సినిమాలు. తమిళ్ నుంచి శివకార్తికేయన్ అమరన్ తో పాటు కన్నడ నుంచి శ్రీ మురళి బఘీరా బరిలో ఉన్నాయి. తెలుగు నుంచి లక్కీ భాస్కర్, క, జీబ్రా వంటి చిత్రాలున్నాయి. అయితే ఈ ఐదు సినిమాల్లో ప్రధానంగా పోటీ మాత్రం లక్కీ భాస్కర్, క చిత్రాల మధ్యే ఉన్నట్టు కనిపిస్తోంది.
దుల్కర్ సాల్మన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లక్కీ భాస్కర్ పీరియాడిక్ మూవీగా వస్తోంది. మహానటి, సీతారామం తర్వాత దుల్కర్ కు ఇక్కడ కొంత క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ లక్కీ భాస్కర్ కు ఓపెనింగ్స్ తెస్తుందా అంటే భారీగా ఉండకపోవచ్చు.. కానీ సితార బ్యానర్ నిర్మించడం వల్ల మాగ్జిమం థియేటర్స్ వస్తాయి. వెంకీ అట్లూరి డైరెక్ట చేసిన ఈ మూవీపై సితార బ్యానర్ గట్టి నమ్మకంతో ఉంది. కాకపోతే ఇప్పటి వరకూ ప్రమోషనల్ గా చేసిన ఇంటర్వ్యూస్ ఏవీ.. లక్కీ భాస్కర్ పై అంచనాలు పెంచలేదు అనేది నిజం.
ఇక కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్ బడ్జెట్ తో మంచి థియేట్రికల్ బిజినెస్ తో రిలీజ్ అవుతున్న సినిమా 'క'. సుజిత్ - సందీప్ ద్వయం తెరకెక్కించిన ఈ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీపై టాలీవుడ్ లో చాలా పాజిటివ్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ తో పాటు పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం అంటున్నారు కానీ ముందు తెలుగులో స్ట్రాంగ్ గా వర్కవుట్ అయితే ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో విడుదల చేస్తే బెటరేమో. ప్రమోషన్స్ పరంగానూ క దూసుకుపోతోంది. మొత్తంగా దీపావళికి ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా.. ప్రధానమైన పోటీ మాత్రం లక్కీ భాస్కర్, క చిత్రాల మధ్యే కనిపిస్తోంది. మరి ఈ ఇద్దరిలో బాక్సాఫీస్ ను గెలుచుకునేది ఎవరో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com